పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి ఇంకా ట్రిపుల్ ఆర్ మ్యానియాలోనే ఉన్నారు. ట్రిపుల్ ఆర్ కి అవార్డుల పరంపరతో ఆయన దేశాలు చుట్టేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తాజాగా బాలీవుడ్ ప్లాప్స్ పై చేసిన సెన్సేషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలీవుడ్ లో వరస పరాజయాలు ఎందుకు వస్తున్నాయో రాజమౌళి చెప్పిన కారణం వింటే నిజమేనేమో అనిపించక మానదు. సౌత్ సినిమాలతో పోటీ పడేందుకు భారీ బడ్జెట్ తో సినిమాలు చేసి బాలీవుడ్ మేకర్స్ పరాజయాలు కళ్లచూస్తున్నారు.
కొన్ని సినిమాలకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాక మేకర్స్ నానా తంటాలు పడుతున్నారు. ఈ పరాజయాలకు దర్శకుడు రాజమౌళి అసలు కారణాలను బయటపెట్టారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కార్పొరేటర్లు అడుగుపెట్టాక.. అక్కడి నటులకి, దర్శకులకి ఎక్కువ పారితోషకాలు ఇవ్వడం మొదలయ్యింది. ఎలాగైనా మన చేతికి డబ్బు వచ్చేస్తుంది కదా అని అలాగైనా హిట్ కొట్టాలనే కసి కొంత తగ్గింది. అందుకే హిందీలో సినిమాలు పరాజయం పాలవుతున్నాయంటూ రాజమౌళి హాట్ కామెంట్స్ చేసారు.
అంతేకాకుండా సౌత్ లో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ సౌత్ లో గెలుపు కోసం కష్టపడాల్సిందే. ఈదాల్సిందే, లేదంటే మునిగిపోవాల్సిందే. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందుతుంది. సినిమా అనౌన్సమెంట్ వచ్చాక ఆదరణ చూసి ఆగకుండా సినిమా విడుదలయ్యే వరకు ప్రమోషన్స్ చేస్తూ కష్టపడాల్సిందే. అప్పుడే సక్సెస్ మన సొంతమవుతుంది అంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారాన్ని రేపాయి.