సీనియర్ హీరోలైన వెంకటేష్-నాగార్జున కొత్త ప్రాజెక్ట్ లు మొదలు పెట్టకుండా గమ్మున కూర్చున్నారు. అటు అక్కినేని ఫాన్స్, దగ్గుబాటి ఫాన్స్ ఇద్దరూ అయోమయంలో ఉన్నారు. మరోవైపు సీనియర్ హీరోలు చిరు-బాలయ్యలు వరస ప్రాజెక్ట్ లతో దూసుకుపోవడమే కాదు.. సంక్రాంతికి ఇద్దరూ ఫైట్ కి రెడీ అయ్యారు. ఇలాంటి సమయంలో నాగార్జున-వెంకటేష్ లు కొత్త ప్రాజెక్ట్ లు మొదలు పెడితే బావుంటుంది అంటూ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.
అయితే నాగార్జున, వెంకటేష్ లు ఇద్దరూ ఒకేరకమైన సమస్యని ఎదుర్కుంటున్నారని తెలుస్తుంది. అసలు పర భాషలో హిట్ మూవీని రీమేక్ చెయ్యాలా.. ఒరిజినల్ కథతో వయసుకు తగిన కథలు చెయ్యాలనే అనే ఆలోచనలతో తమ వద్దకు వచ్చే కథలు ఎలా ఉండాలో అనే కన్ఫ్యూషన్ లో ఉన్నారట. నాగార్జున ద ఘోస్ట్ పరాభవం తర్వాత ఓటిటికి చెయ్యాలా.. లేదంటే సినిమా చెయ్యాలా అని ఆలోచిస్తున్నారు. సినిమా అయితే ఎలాంటి కథ ప్రేక్షకుడికి నచ్చుతుంది అని ఆలోచిస్తున్నారట.
ఇక వెంకటేష్ ఓటిటిలోకి ఎంట్రీ ఇవ్వడమేమిటీ.. రానా నాయుడు వెబ్ సీరీస్ రిలీజ్ కి సిద్ధం చేసేసాడు. ఇప్పుడు ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తే.. వారు మెచ్చుతారో అనే ఆలోచనలో వెంకీ ఉన్నారట.