టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకు గా ప్రభాస్ మిగిలిపోయాడు. 40 ఇయర్స్ దాటిపోయినా ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఆయన అనుష్క శెట్టి తో లవ్ ఉన్నాడని ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరిగినా.. అది వాళ్ళు కొట్టిపారేశారు. ఈమధ్యన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో ప్రభాస్ డేటింగ్ లో ఉన్నాడనే న్యూస్ భీభత్సంగా స్ప్రెడ్ అయ్యింది. కానీ కృతి సనన్ అన్ని జస్ట్ రూమర్స్, ప్రభాస్ నాకో మంచి కో స్టార్ అనేసింది. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజుగారు ప్రభాస్ కి పెళ్లి చెయ్యాలని అనుకున్నారు. ఆ కోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోయారు. ఇక ప్రభాస్ పెళ్లి అందరికి ఓ పజిల్ గా మిగిలిపోయింది.
కానీ ఇప్పుడో హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోగానే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ ఫన్ చేస్తున్నాడు. ఆయనెవరో కాదు కోలీవుడ్ మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకు విశాల్. వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమ వ్యవహారం బ్రేకప్ అయ్యాక.. విశాల్ అనీషా రెడ్డి తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆ నిశ్చితార్ధమూ ఆగిపోయింది. ఈమధ్యన తాను పెళ్లి చేసుకుంటాను, అది కూడా అతి త్వరలోనే అని చెప్పాడు. తాజాగా విశాల్ ని మీడియా వారు వచ్చే ఏడాది 2023 లో అయినా పెళ్లి చేసుకుంటారా అని అడిగారు.
దానికి విశాల్ ఫన్నీగా ప్రభాస్ పెళ్లి చేసుకున్న వెంటనే పెళ్లి చేసుకుంటాను అంటూ సమాధానమిచ్చాడు. పెళ్లి అంటే ఎన్నో బాధ్యతలతో కూడుకున్న వ్యవహారం, మనం మన వృత్తి పట్ల ఎంత అంకిత భావంగా ఉన్నామో.. పర్సనల్ లైఫ్ లోనూ అంటే అంకిత భావంతో ఉండాలి, నటుడిగా తనపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయని, పెళ్లి చేసుకోవాలని ఉన్నప్పటికీ.. ప్రస్తుతం సినిమాలపైనే తన దృష్టి అంటూ విశాల్ మరోమారు పెళ్లి విషయాన్ని దాటేశాడు.
ఈ న్యూస్ గనక ప్రభాస్ చూస్తే ఏంటి డార్లింగ్ నిన్ను పెళ్లి చేసుకోమంటే.. నన్ను పెళ్లి చేసుకోమని ఇరికిస్తున్నావ్ అంటూ స్పందిస్తాడేమో.