టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తల్లి బాల సరస్వతి ఈరోజు మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం ఆవిడకి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆమెని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్చగా.. ఈరోజు చికిత్స పొందుతూ మరణించారు. కిమ్స్ నుంచి ఆమె భౌతికకాయాన్ని దర్శకుడు రాజమౌళి ఇంటికి తరలిస్తారని తెలుస్తుంది.
రాజమౌళి కి కీరవాణి కజిన్ అవుతారు. రాజమౌళికి కీరవాణి తల్లి పిన్ని అవుతారు. కీరవాణి - రాజమౌళి కలయికలో మ్యూజిక్ ఆల్బమ్స్ అన్ని హిట్స్. అలాగే కీరవాణి ఇతర సినిమాలకి మ్యూజిక్ అందిస్తూ ఉంటారు. కీరవాణి భార్య శ్రీవల్లి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటారు. కీరవాణి తల్లి పరమపదించారని తెలిసి ఇండస్ట్రీ ప్రముఖులు కీరవాణికి ఆయన ఫ్యామిలీకి సంతాపం తెలియజేస్తున్నారు.