బిగ్ బాస్ సీజన్ 6 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఆరోహితో చేసిన ఫ్రెండ్ షిప్ తో బాగా హైలెట్ అవడమే కాదు, టాస్క్ ల విషయంలోనూ ఆర్జే సూర్య అంతే పోటీ ఇచ్చాడు. ఆరోహి తో హగ్గులు, ముద్దులు తర్వాత ఆర్జే సూర్య ఆడియన్స్ కి బాగా రిజిస్టర్ అయ్యాడు. ఆరోహి ఎలిమినేట్ అయ్యిందో లేదో.. ఇనాయని లైన్ లో పెట్టాడు. ఇనాయకి ముద్దలు తినిపించడం, ముద్దులివ్వడం, హగ్ చేసుకోవడం ఇలా బిగ్ బాస్ ఫుటేజ్ కోసం విషయాన్ని చాలా దూరం తీసుకువెళ్లాడు. ఇనాయ కూడా సూర్యతో అంతే క్లోజ్ అయ్యింది. ఇనాయ సూర్య తో ఫ్రెండ్ షిప్ మొదలు పెట్టాక ఆమె ఆట, గ్రాఫ్ రెండూ పడిపోయాయి. దానితో నాగార్జున క్లాస్ పీకారు.
అప్పటినుండి సూర్య-ఇనాయలు విడిపోయినట్టు కనబడి కలిసి గేమ్ ఆడారు. ఇనాయ ఓ విషయంలో సూర్య ఎలిమినేట్ అవ్వాలంటూ రేవంత్ తో చెప్పింది. అదే వారం సూర్యని ఇనాయ నామినేట్ చెయ్యడం, స్ట్రాంగ్ ప్లేయర్ సూర్య ఎలిమినేట్ అవడం అందరికి షాకిచ్చింది. సూర్య వెళ్ళాక హౌస్ లో సూర్యనే కలవరించిన ఇనాయకు మళ్ళీ నాగ్ క్లాస్ ఇవ్వడంతో గేమ్ మీద ఫోకస్ పెట్టింది. ఇక సూర్య బయటికి వచ్చాక అతన్ని ఇనాయ మోసం చేసిన విషయం వీడియోతో సహా చూపించారు. కొద్దిగా సూర్య ఫీలైనా ఇనాయ ఎదుగుదలకి తన సపోర్ట్ ఉంటుంది అన్నాడు. ఇక సూర్య అంటే క్రష్ అని చెప్పిన ఇనాయ గత వారం ఎలిమినేట్ అయ్యింది.
ఎలిమినేట్ అయ్యాక ఇనాయ యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వూస్ కన్నాముందు ఆర్జే సూర్యని కలిసింది. అదే విషయాన్ని సూర్య తన ఇన్స్టా లో పోస్ట్ చేసాడు. ఇనాయతో సూర్య కలిసి దిగిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.