అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో హిట్ కొట్టి చాలా కాలమైపోయింది. ఏజెంట్ తో పాన్ ఇండియా లెవల్లో దిగుతాడనుకుంటే అఖిల్ ఎవరికీ కనిపించకుండా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. అఖిల్ ఏజెంట్ రకరకాల రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ చివరికి సంక్రాంతికి ఫిక్స్ అయ్యింది. కానీ సంక్రాంతి బరి నుండి ఏజెంట్ పక్కకి జరిగిపోయింది అనే వార్తలను టీమ్ కనీసం కొట్టిపోయారేయ్యకుండా కామ్ గా చూడడం అందరిలో ఏజెంట్ పై దాని రిలీజ్ డేట్ పై అనుమానాలు మొదలయ్యాయి.
మరోపక్క సురేందర్ రెడ్డి ఏజెంట్ ని రీ షూట్ చేస్తున్నారనే టాక్ కూడావినిపిస్తుంది. హైలెట్ అనుకున్న సీన్స్ సంతృప్తికరంగా లేకపోవడంతో దర్శకనిర్మాతలు ఏజెంట్ యాక్షన్ ఎపిసోడ్స్ ని రీ షూట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హైలెట్ అయ్యాయి. కనీసం సురేందర్ రెడ్డి బర్త్ డే కి అయినా ఏజెంట్ అప్ డేట్ ఇస్తారనుకున్నారు. కానీ మేకర్స్ అఖిల్ ఏజెంట్ విషయంలో ఇంకా తికమకలు పడుతున్నారు. అఖిల్ లుక్, అలాగే మమ్ముట్టి లుక్ తప్ప ఈ సినిమా నుండి ఎలాంటి పిక్స్ రిలీజ్ కాలేదు. పాన్ ఇండియా మూవీ అని ప్రకటించేస్తే సరిపోదు దానికి తగ్గ ఏర్పాట్లు చెయ్యాలి.
కానీ అఖిల్ కూడా ఈ మధ్యన సోషల్ మీడియాలో, పబ్లిక్ లో కానీ కనిపించడం లేదు. ఏజెంట్ విషయంలో ఇంత సైలెన్స్ ని అక్కినేని ఫాన్స్ భరించలేకపోతున్నారు. కనీసం సంక్రాంతి రేస్ ని తప్పించి మరో డేట్ ఇచ్చినా బావుండేది అనేది వాళ్ళ ఫీలింగ్.