Advertisementt

ఇక్కడ రొమాంటిక్ శృతి.. మరి అక్కడ..

Wed 14th Dec 2022 11:22 AM
balakrishna,shruti haasan,chiranjeevi  ఇక్కడ రొమాంటిక్ శృతి.. మరి అక్కడ..
Balakrishna and Shruti Haasan romantic pics in Veera Simha Reddy ఇక్కడ రొమాంటిక్ శృతి.. మరి అక్కడ..
Advertisement
Ads by CJ

రాబోయే సంక్రాంతికి ఒక్క హీరోయిన్ హవానే కనిపిస్తుంది. బాలకృష్ణ వీర సింహ రెడ్డిలోను, చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమాలోనూ హీరోయిన్ గా కనిపించబోయేది శృతి హాసన్. ప్రస్తుతం బాలయ్య, చిరు లతో శృతి హాసన్ రొమాంటిక్ గా డ్యూయెట్స్ లో డాన్స్ స్టెప్స్ వేస్తుంది. చిరంజీవి తో రెండు సాంగ్స్ కోసం ప్రస్తుతం ఆమె యూరప్ వెళ్ళింది. ఇప్పటికే బాలయ్య తో వేసిన చిందులు పూర్తయ్యాయి. ఇక వీర సింహ రెడ్డి నుండి సెకండ్ సింగిల్ గా శృతి హాసన్ తో బాలకృష్ణ రొమాంటిక్ సాంగ్ రాబోతుంది. అది రేపు డిసెంబర్ 15 న విడుదల చేస్తున్నారు.

వీరసింహ రెడ్డి నుండి విడుదలవుతున్న సెకండ్ సింగిల్ పోస్టర్స్ లో శృతి హాసన్ బాలయ్య తో చాలా రొమాంటిక్ గా గ్లామర్ గా కనిపిస్తుంది. ఈ సాంగ్ టర్కీలో తెరకెక్కింది. ఇందులో ఇంత అందంగా ఉన్న శృతి హాసన్ వీరయ్య పక్కన ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ అందరిలో కనిపిస్తుంది. చిరు పక్కన రొమాంటిక్ గా ఉంటుందా.. అంతకు మించి అనేలా శృతి హాసన్ కనిపిస్తుందా.. అని మెగా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాల్తేర్ వీరయ్య నుండి ఇంకా శృతి హాసన్ పిక్ రిలీజ్ అవ్వలేదు.

మాస్ కేరెక్టర్ వీరయ్య సరసన శృతి హాసన్ ఎలా కనబడుతుందో.. సారీస్ లోనా లేదంటే మరింత గ్లామర్ షో చేస్తుందో అనే క్యూరియాసిటీ ఫాన్స్ లో పెరిగిపోతుంది. వీర సింహ రెడ్డి సాంగ్ తర్వాత వీరయ్య సాంగ్ కూడా క్యూ లోనే ఉంటుంది.

Balakrishna and Shruti Haasan romantic pics in Veera Simha Reddy:

Balakrishna, Shruti Haasan Turkey Romance

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ