Advertisementt

మెగా ఫ్యామిలీ సంతోషం ఆవిరి చేస్తున్నారా..

Wed 14th Dec 2022 10:05 AM
ram charan,upasana,mega family  మెగా ఫ్యామిలీ సంతోషం ఆవిరి చేస్తున్నారా..
The happiness of the mega family evaporates మెగా ఫ్యామిలీ సంతోషం ఆవిరి చేస్తున్నారా..
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలిలో ప్రతి ఫెస్టివల్, అలాగే చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్న్ ప్రతి ఏడు ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తారు ఫ్యామిలీ మెంబెర్స్. మిగతా హీరోలు తమ పుట్టిన రోజులనాడు ఏదో ఒక వెకేషన్స్ కి చెక్కేసి అక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో సంతోషం వెల్లువిరిసింది. మెగా ఫ్యామిలిలో ఆనందం తాండవం చేస్తుంది. ఎందుకంటే మెగా హీరో రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. మెగాస్టార్ ఇప్పటివరకు తాత అయినా.. అది కూతుళ్ళ కూతుర్లకు తాతగా ఉన్నారు. కానీ కొడుకు పిల్లలకి తాతగా మారబోతున్న చిరు తన వంశం వృద్ధి చెందుతుందన్న ఫీలింగ్ లో పట్టలేని సంతోషంలో మునిగితేలుతున్నారు. మెగా ఫ్యామిలిలో రామ్ చరణ్-ఉపాసనలు తల్లితండ్రులు కాబోతున్నారని తెలిసిన మరు క్షణం నుండే అక్కడ సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది.

కానీ ఆ సంతోషాన్ని ఆవిరి చెయ్యడానికి సోషల్ మీడియా రెడీ అయ్యింది. అదెలా అంటే.. ఇప్పటివరకు పిల్లలని కనకుండా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న చరణ్-ఉపాసనలు సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం అందరికి బావుంది. కానీ ఉపాసన నేచురల్ పద్ధతిలో ప్రెగ్నెంట్ కాలేదు, ఆమె సరోగసి ద్వారా తల్లి కాబోతుంది. రామ్ చరణ్-ఉపాసన దంపతులు సరోగసి ద్వారా పేరెంట్స్ అవుతున్నారంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

రామ్ చరణ్-ఉపాసనలు పేరెంట్స్ అవ్వడానికి ప్లాన్ చేసుకుని ఇలా శుభవార్త చెప్పగానే ఎగ్జైట్ అయిన మెగా ఫాన్స్.. ఇలా యాంటీ ఫాన్స్ ఫ్యామిలీ విషయంలో కూడా ట్రోల్స్ చెయ్యటం.. ఇప్పుడు వినిపిస్తున్న వార్తలతో మెగా ఫాన్స్ కంగారు పడుతున్నారు. అసలే మెగా ఫ్యామిలిలో జరిగే ఏ విషయాన్ని అయినా మీడియా హైలెట్ చెయ్యకుండా మానదు. అక్కడ జరిగే ప్రతి ఒక్క విషయంపై మీడియా గట్టిగా ఫోకస్ పెడుతుంది. ఇప్పుడు రామ్ చరణ్ విషయంలోనూ అదే జరుగుతుంది.

The happiness of the mega family evaporates:

Ram Charan And Upasana Becoming Proud Parents 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ