జగన్ ప్రభుత్వానికి భజన చేసినందుకుగాను సినీ నటులు కమెడియన్స్ అలీ కి అలాగే పోసాని కృష్ణమురళికి జగన్ ప్రభుత్వం ఊరించి ఊరించి ఏవో పదవులుకట్టబెట్టింది. ఆ పదవులకి ఎలాంటి వాల్యూ కూడా లేదు. ప్రత్యేకంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని తిట్టినందుకే అలికి, పోసానికి జగన్ ప్రభుత్వం ఈ పదవులు ఇచ్చింది అని చాలామంది అనుమానిస్తున్నారు కూడా. అయితే అలీ తనకి ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైసర్ పదవిని ఇంకా చేపట్టలేదు. కూతురు ఫాతిమా వివాహ పనులతో బిజీగా వున్న అలీ జగన్ ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించలేదు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి అలీ కూతురు పెళ్ళికి విచ్చేసారు.
తాజాగా ఆలి ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైసర్ బాధ్యతలు ఇంకా తీసుకోలేదని, త్వరలోనే వైసీపీ అధినేతల మధ్యలో ఆ పదవి బాధ్యతలు చేపట్టబోతున్నట్లుగా చెప్పాడు. వైసిపిలో చేరినప్పుడు నాకు ఎలాంటి పదవి ఆఫర్ చెయ్యలేదు, నేను నా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే అధిష్టానమే పిలిచి తనకి బాధ్యతలు అప్పజెబుతారని అనుకున్నట్టుగానే నాకు ఎలెక్ట్రానిక్ మీడియా అడ్వైసర్ పదవి ఇచ్చారని అలీ చెప్పాడు. అలాగే ముందుగానే పార్టీ టికెట్ అడగకూడదని అడగలేదు, మనం చేసే పనులని పార్టీ గుర్తించి మనకి ఇచ్చే బాధ్యతలు పెంచుతారు.
ప్రస్తుతం నన్ను పార్టీ పోటీ చెయ్యమని అడగలేదు, ఒకవేళ పార్టీ ఎక్కడనుండి పోటీ చెయ్యమన్నా చేస్తాను, ఇంకా టికెట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, నాకు టికెట్ రాగానే చెబుతాను అంటూ జగన్ తనకి ఎమ్యెల్యే టికెట్ ఇస్తారని, ఎక్కడి నుండి పోటీ చెయ్యమని అడిగినా చేస్తానని చెప్పడం చూస్తుంటే.. అలీ వైసిపి ప్రభత్వం, జగన్ నుండి చాలానే ఆశిస్తున్నాడనిపిస్తుంది.