వాల్తేర్ వీరయ్య ప్రీ లుక్ పోస్టర్ దగ్గర నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ వరకు మెగాస్టార్ చిరంజీవి ని చూడగానే ముఠామేస్త్రి మూవీని గుర్తుకు తెచ్చాయి, పరమ రొటీన్ అన్నారు. దర్శకుడు బాబీ కూడా మెగాస్టార్ ని ముఠామేస్త్రీల చూపించబోతున్నట్లుగా చెప్పకనే చెప్పేసాడు. అలాగే దేవిశ్రీ మ్యూజిక్ ఆల్బమ్స్ లో బాస్ పార్టీ కూడా ఊపేస్తుందనే అనుకున్నారు. కానీ చిరు వాల్తేర్ వీరయ్య లుక్ కానీ, బాస్ పార్టీ సాంగ్ కానీ మెగా ఫాన్స్ కి తప్ప మిగతా వారికి అంతగా నచ్చలేదనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.
ఈ సంక్రాంతికి బాలయ్య వీరసింహ రెడ్డి ముందు చిరు వాల్తేర్ వీరయ్య తేలిపోవచ్చనే ఊహాగానాలు, చర్చలు కూడా ఊపందుకున్నాయి. దానితో మెగా ఫాన్స్ ఆందోళపడ్డారు.
కానీ వాల్తేర్ వీరయ్యలో స్పెషల్ కేరెక్టర్ చేస్తున్న రవితేజ ఎంట్రీ తోనే దుమ్మురేపాడు. రవితేజ మాస్ ఎంట్రీ, ఆయన లుక్ అన్ని వాల్తేర్ వీరయ్యపై అంచనాలు పెరిగేలా చేసింది. ACP విక్రమ్ కుమార్ గా రవితేజ కనిపించబోతున్నాడు. అయినప్పటికీ మాస్ అవతార్ లో మెగా ఫాన్స్ లో జోష్ పెంచడమే కాదు, వాల్తేర్ వీరయ్యపై సప్పగా ఉన్న అంచనాలు పెంచేసి సినిమాపై హైప్ క్రియేట్ చేసాడు. బాబీ రవితేజ లుక్ విషయంలో, ఆయన కేరెక్టర్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అన్నట్టు చిరు-రవితేజలు సవతి సోదరులుగా వాల్తేర్ వీరయ్యలో ఫైట్ చేసుకోబోతున్నారంటూ ఎప్పటినుండో ప్రచారంలో ఉంది, కానీ రవితేజ పవర్ ఫుల్ ఎంట్రీ మాత్రం వాల్తేర్ వీరయ్య పై స్పెషల్ అంచనాలు పెంచేసింది.
దెబ్బకి సంక్రాంతి రిలీజ్ లలో వీరయ్య గట్టి పోటీ అని మెగా ఫాన్స్ ఫిక్స్ అయ్యారు. బాలయ్య వీరసింహ రెడ్డిపైకి వాల్తేర్ వీరయ్య సింహాలా దూసుకురాబోతుంది అంటూ కాలర్ ఎగరేస్తున్నారు వారు.