పుట్టడం పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టి గత ఏడాది డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలులో చిప్ప కూడు తిన్న షారుఖ్ ఖాన్ కొడుకు కొద్దిరోజులు జైలు జీవితం గడిపాడు. బడా సెలెబ్రిటీ కొడుకుగా షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ విపరీతంగా పాపులర్ అయ్యాడు. అతను డ్రగ్స్ కేసులో జైలు లో ఉండడం, విడిపించడానికి షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ నానా కష్టాలు పడడం, కొడుకు కోసం గౌరీ ఖాన్ తిండీతిప్పలు మానెయ్యడం అబ్బో ఇదంతా బాలీవుడ్ మీడియాలో ఓ సినిమా స్టోరీలా నడిచింది. ఈమధ్యనే ఆర్యన్ ఖాన్ పై డ్రగ్స్ కేసు కొట్టేసింది కోర్టు.
ఇక వెండితెర మీదకి హీరోగా ఆర్యన్ ఖాన్ ఎంట్రీ ఇస్తాడేమో అనుకుంటున్న సమయంలో అతను డైరెక్షన్ లోకి వెళ్ళబోతున్నట్టుగా ప్రకటించాడు. అలా దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నట్టుగా ప్రకటించిన కొద్దిరోజులకే ఆర్యన్ ఖాన్ తన స్నేహితులతో కలిసి వోడ్కా బిజినెస్ లోకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆర్యన్ ఖాన్ ప్రీమియం వోడ్కా బ్రాండ్ ను దేశంలో విస్తరించనున్నారని సమాచారం.
ఇప్పటికే ఆర్యన్ ఖాన్ అతని ఫ్రెండ్స్ ఈ వ్యాపారం కోసం ఇండియాలోనే నెంబర్ వన్ బెవరేజెస్ కంపెనీతో టైఅప్ అయినట్లుగా టాక్. శ్లాబ్ వెంచర్స్ అనే పేరుతో కంపెనీని స్టార్ట్ చేసిన ఆర్యన్ అతని ఫ్రెండ్స్ దీనిని బడా కంపెనీగా విస్తరించే ప్లాన్ లో ఉన్నట్టుగా ఓ ఇంగ్లీష్ పేపర్ లో ప్రముఖంగా ప్రచురించారు. ప్రస్తుతం మార్కెట్ లో శూన్యత ఆవరించి ఉండడంతో ఇలాంటి వ్యాపారానికి అనుకూలంగా ఉండడంతోనే ఆర్యన్ ఈ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా చెబుతున్నాడు.