ఈమధ్యన బుల్లితెర లో ఏ ఛానల్ ని చూసినా శ్రీముఖి నే కనిపిస్తుంది. బరువు తగ్గి గ్లామర్ పెంచిన శ్రీముఖి జెమినీ ఛానల్ నుంచి, ఈటివి, మా టివి, జీ తెలుగు ఇలా ఏ ఛానల్ లో చూసినా శ్రీముఖి అందాలే దర్శనమిస్తున్నాయి. రకరకాల కాస్ట్యూమ్స్ తో రకరకాల యాంగిల్స్ లో అందాలు ఆరబోస్తూ హడావిడి చేస్తున్న ఈ యాంకర్.. ఖాళీ సమయాల్లో గోవా బీచ్ లో తేలుతుంది. ఫ్రెండ్స్ తో కలిసి గోవా లో సముద్రపు నీటిలో అందాలను చూపిస్తూ ఊరించేస్తుంది.
శని, ఆదివారాల్లో ఏ ఛానల్ మార్చినా స్పెషల్ ప్రోగ్రామ్స్ లో శ్రీముఖినే కనబడుతుంది. ఇప్పుడు స్టార్ మా లో మొదలు కాబోయే BB జోడిలోనూ శ్రీముఖినే యాంకర్ గా రాబోతున్నట్టుగా ప్రోమో రివీల్ చేసారు. బిగ్ బాస్ లోకి వెళ్లోచ్చిన కంటెస్టెంట్స్ ని జోడీలుగా మార్చి స్టార్ మా BB జోడి ప్రోగ్రాం మొదలు పెడుతుంది. అందులో అఖిల్, రోల్ రైడా, ఆశు రెడ్డి, తేజస్వి, భాను, వాసంతి, మెహబూబా, అరియనా, అవినాష్, అర్జున్ కళ్యాణ్ ఇలా చాలామంది పాల్గొంటున్నారు.
ఆ BB జోడికి కూడా శ్రీముఖినే యంకరా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొత్త యాంకర్స్ ఎవరూ లేరా.. లేదంటే రావడం లేదా.. అన్నిటిలో శ్రీముఖిని చూసి చూసి బోర్ కొట్టేస్తుంది అనే కామెంట్స్ కూడా మొదలయ్యాయి.