యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో తెరకెక్కనున్న NTR30 షూటింగ్ మొదలు కాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన ఫ్యామిలీ తో యుఎస్ ట్రిప్ వెళ్ళాడు. యుఎస్ లోనే ఎన్టీఆర్ తన న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడట. ఇక ఎన్టీఆర్ లేకపోయినా కొరటాల శివ మాత్రం NTR30 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్ పూర్తి చేసిన కొరటాల DOP రత్నవేలు తో మీటింగ్ పెట్టారు.
కొరటాల మరోపక్క స్టార్ కాస్ట్ లో బిజీగా వున్నారు. ప్రస్తుతం కీలక నటుల ఎంపిక జరగితుందట. ఎన్టీఆర్ యుఎస్ నుండి రాగానే NTR30 సెట్స్ మీదకి వెళతారని తెలుస్తుంది. రీసెంట్ గానే NTR30 ని నిర్మించబోయే యువ సుధా ఆర్ట్స్ ఆఫీస్ కూడా ఓపెన్ అయ్యింది. ఇక తాజాగా NTR30 లో ఎన్టీఆర్ పాత్రపై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. NTR30 కి ఎన్టీఆర్ కి ఆరు వేళ్లు ఉన్న చేతితో కనిపించబోతున్నాడట. ఆ ఎక్స్‌స్ట్రా ఫింగరే ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసేలా కొరటాల డిజైన్ చేశారని తెలుస్తుంది.
అతనికి తెలియకుండానే వేలు పలు రకాల సంజ్ఞలు చేస్తుందని చెబుతున్నారు. ఇదే సినిమాకి హైలెట్ అట. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో ఉండబోతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉంది.