బిగ్ బాస్ సీజన్ 6 ఎంత చెత్త చప్పగా, ఎంత చెత్తగా ఉందో దానికి వస్తున్న టీఆర్పీ ని చూస్తే తెలుస్తుంది. ఒకటి, రెండు, మూడు సీజన్స్ హిట్ అయినా తెలుగు బిగ్ బాస్ ప్రస్తుతం ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది. అందులో బిగ్ బాస్ ఓటిటి వలన ఈ సీజన్ అంతగా ఎక్కడం లేదు. ఒటిటి బిగ్ బాస్ పూర్తయిన నెలల గ్యాప్ లో మళ్ళీ బిగ్ బాస్ అంటే రొటీన్ సీరియల్ గా అనిపిస్తుంది తప్ప కొత్తగా కనిపించేలేదు అనేది ఆడియన్స్ ఫీలింగ్. ఇక ఈ సీజన్ చూసాక మరో బిగ్ బాస్ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది.
అలాగే బిగ్ బాస్ లో ఓటింగ్ తో సంబంధం లేకుండా కంటెస్టెంట్స్ ని కావాలని ఎలిమినేట్ చేస్తున్నారని, అటు హోస్ట్ నాగార్జున పై కూడా ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. నాగార్జున వచ్చే శని, ఆదివారాలు ఎపిసోడ్ కూడా రక్తి కట్టడం లేదు, ఆయన హోస్టింగ్ బోరింగ్ అనిపిస్తుంది అంటూ కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. వచ్చే సీజన్ కి నాగార్జున ని తప్పించాలనే యోచనలో యాజమాన్యం ఉంది అనితెలుస్తుంది. అయితే నాగార్జునకి కూడా బిగ్ బాస్ అంటే బోర్ కొట్టేసినట్లుగా ఆయన హోస్టింగ్ ఉంటుంది.
బిగ్ బాస్ ఓటీటీలో నాగార్జునే, టివి షోస్ లోను నాగార్జునే.. అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా నీరసంగా సాగుతున్న ఎపిసోడ్స్ చూసాక నాగార్జునకి బిగ్ బాస్ అంటే బోర్ కొట్టిందా.. లేదంటే నాగార్జునే బిగ్ బాస్ కి బోర్ కొట్టారా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.