దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం ‘ఆస్కార్’ కోసం టీమ్ ప్రయత్నాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆ అవార్డుకి కొంచెం తక్కువైన గ్లోబల్ గ్లోబ్ రేసులోకి ఆ సినిమా దూసుకురావడంతో.. సర్వత్రా టీమ్‌కి అభినందనల వర్షం కురుస్తోంది. 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలోనూ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ నామినేట్ అయ్యాయి. ఆస్కార్ వేటలో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కి ఇది అదిరిపోయే వార్తనే చెప్పుకోవాలి.
ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఎటువంటి ఆదరణను పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్‌గా జపాన్‌లో కూడా ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేసింది. అంతకుముందు రజనీకాంత్ ‘ముత్తు’ సినిమా క్రియేట్ చేసిన రికార్డులను తిరగరాసి.. అక్కడా చరిత్ర సృష్టించింది. అలాంటి సినిమాకు ఆస్కార్ కోటాలో చోటు దక్కకపోవడంతో రాజమౌళి హర్టయ్యాడు. ఎలాగైనా ఆస్కార్ కొట్టి చూపాలని ప్రయత్నాలు మొదలెట్టాడు. ఏ మార్గంలో వెళితే అది నెరవేరుతుందో ఆ ప్రయత్నాల్లోనే ఆయన ఉన్నాడు. ఈ లోపు గ్లోబల్‌గా ఈ సినిమాకు గుర్తింపు దక్కినట్లుగా.. గ్లోబల్ గ్లోబ్ అవార్డ్స్‌లో నామినేషన్ దక్కించుకోవడం.. నిజంగా ఆ టీమ్‌కు ఇది బూస్ట్ లాంటి వార్తే. ఈ విషయం తెలిసి ప్రభాస్ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ.. ఇన్‌స్టాగ్రమ్ వేదికగా టీమ్‌కు అభినందనలు తెలిపాడు. ఇక ఆస్కార్‌కు అడుగు దూరంలోనే ‘ఆర్ఆర్ఆర్’ ఉంది. చూద్దాం.. ఏం జరుగుతుందో?