Advertisementt

మారుతి కోసం ప్రభాస్ త్యాగం

Tue 13th Dec 2022 12:34 PM
prabha,maruthi,prabhas- maruthi project shooting details  మారుతి కోసం ప్రభాస్ త్యాగం
Prabhas sacrifice for Maruti మారుతి కోసం ప్రభాస్ త్యాగం
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిన్న దర్శకుడు మారుతి తో సినిమా చెయ్యడం ఆయన ఫాన్స్ కి సుతరామూ ఇష్టం లేదు. అయినప్పటికీ ప్రభాస్ డేర్ చేసి మారుతి తో ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టడమే కాదు, ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడమే కానీ, ఎలాంటి అప్ డేట్ ఈ సినిమాపై రాలేదు. రాజా డీలక్స్ టైటిల్ కూడా పెట్టేసారు. కానీ మీడియాకి ఇన్ఫర్మేషన్ లేదు. అయినప్పటికీ మారుతి ప్రభాస్ ని ఫాన్స్ కి మెచ్చేలా చూపించి మార్కులు కొట్టేసి, వాళ్ళ కోపాన్ని తగ్గించాలని చూస్తున్నాడు.

ఇక సలార్, ప్రాజెక్ట్ K షూటింగ్స్ చేస్తూనే మధ్య మధ్యలో మారుతి ప్రాజెక్ట్ కి కూడా డేట్స్ వెచ్చిస్తున్నారు. నెలరోజుల పాటు సలార్ షూటింగ్ లో పాల్గొన్న ప్రభాస్ ఓ రెండు రోజులు ప్రాజెక్ట్ K షూట్ లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు బాలయ్య తో అన్ స్టాపబుల్ ఎపిసోడ్ షూట్ ఫినిష్ చేసిన ప్రభాస్ మారుతి ప్రాజెక్ట్ కోసం ఓ వారం రోజులు కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఇలా ఆ నోటా ఈ నోటా పబ్లిసిటీ జరగడమే కానీ.. అధికారికంగా ఎలాంటి అప్ డేట్ లేకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. కారణం ప్రభాస్ ఫాన్స్ ట్రోల్ చేస్తారేమో అనే భయం. 

ఇక ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్‌ లు ప్రభాస్ తో రొమాన్స్ చెయ్యబోతున్నారు. జస్ట్ 60 డేస్ లోనే ప్రభాస్ ప్రాజెక్ట్ ముగించేసే ప్లాన్ లో మారుతి ఉన్నాడట. ఇలా పాన్ ఇండియా సినిమాల షూటింగ్స్ మధ్యలో ప్రభాస్ కొద్దిగా త్యాగం చేస్తూ మారుతి ప్రాజెక్ట్ కి డేట్స్ కేటాయిస్తున్నాడని తెలుస్తుంది.

Prabhas sacrifice for Maruti:

Prabhas- Maruthi project shooting details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ