బిగ్ బాస్ సీజన్6 కి క్రేజ్ తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ యాజమాన్యం నానారకాల తిప్పలు పడుతుంది. కానీ లీకులు గనక ఆపినట్లయితే.. బిగ్ బాస్ క్రేజ్ కి ఎలాంటి ఢోకా ఉండేది కాదు, హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉన్నప్పటికీ.. ఎలిమినేషన్ ప్రక్రియని గ్రిప్పింగ్ గా లీకవ్వకుండా చూసినట్లయితే.. ఎంతో కొంత వీకెండ్ ఎపిసోడ్స్ పై బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తి కనబర్చేవారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆత్రుత కనబడేది. కానీ లీకుల వీరుల వలన ఆ ఆసక్తి చచ్చిపోతుంది. ఇక వారం వారం స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్స్ బయటికి వెళ్ళినట్లే.. టాప్5 అనుకున్న ఇనాయ లాస్ట్ వీక్ ఎలిమినేట్ అవడం ఎవరికీ రుచించలేదు. టాప్ 5 లో ఉండాల్సిన ఇనాయని ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ ఫాన్స్ ఫైట్ కూడా చేసారు.
ఇనాయ సంగతి అలా ఉంటే.. ఈ లాస్ట్ వీక్ లో మిడిల్ వీక్ ఎలిమినేషన్ రేపు రాత్రికి జరగబోతుంది. టాప్ 5 ఉండాల్సిన హౌస్ లో టాప్ 6 ఉన్నారు. అందుకే ఒకరిని వీక్ మిడిల్ లో పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. దానిలో భాగంగా రెండు రోజుల ఓట్స్ పరిగణనలోకి తీసుకుని వారిని ఎలిమినేట్ చేస్తారు. బయట ఓటింగ్ తో సంబందం లేకుండా ఎలిమినేషన్ జరుగుతుంది అంటూ ప్రచారం జరగడంతో.. నాగార్జున బల్లగుద్ది మీ ఓటింగ్ తోనే ఎలిమినేట్ అవుతారంటూ గత ఆదివారం రాత్రి ఎపిసోడ్ లో చెప్పారు.
అయితే ఈ వారం రేవంత్ ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉంటే శ్రీహన్ సెకండ్ ప్లేస్ లోను, రోహిత్ మూడో ప్లేస్ లో ఉండగా.. కీర్తి నాలుగో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో ఆది రెడ్డి, శ్రీ సత్య చివరి ప్లేస్ లోకి పడిపోయినట్లుగా తెలుస్తుంది. ఫైనల్ గా ఆది రెడ్డి vs శ్రీ సత్య ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.