Advertisementt

1000 కోట్ల టార్గెట్ తో బరిలోకి పుష్ప

Mon 12th Dec 2022 10:11 PM
allu arjun,pushpa 2 range  1000 కోట్ల టార్గెట్ తో బరిలోకి పుష్ప
Allu Arjun target is 1000 crores 1000 కోట్ల టార్గెట్ తో బరిలోకి పుష్ప
Advertisement
Ads by CJ

పుష్ప ద రైజ్ తోనే ఇండియా వైడ్ కాదు ప్రపంచంలోని రష్యాలాంటి దేశాల్లో క్రేజ్ చూపించిన అల్లు అర్జున్-సుకుమార్ లు ప్రస్తుతం పుష్ప పార్ట్2 పుష్ప ద రూల్ షూటింగ్ మొదలు పెట్టారు. మధ్యలో రష్యన్ ప్రమోషన్స్ తో షూటింగ్ వాయిదా పడినా.. పుష్ప ద రూల్ రెగ్యులర్ షూట్ లోకి ఇంకా అల్లు అర్జున్ అడుగుపెట్టనే లేదు. ఇక పుష్ప పార్ట్ 1 తో 350 కోట్లకి పైగా కొల్లగొట్టి ఇప్పుడు పుష్ప పార్ట్2 తో 1000 కోట్లు కొల్లగొట్టే ప్లాన్ లో సుక్కు-బన్నీ ఉన్నట్లుగా తెలుస్తుంది. 1000 కోట్లు పైనే కానీ.. ఈ లోపు ఎలాంటి ఫిగర్ వినబడకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యి పుష్ప ద రూల్ స్క్రిప్ట్ చెక్కి చెక్కి ఫైనల్ గా షూట్ కి వెళుతున్నారట.

రష్మిక శ్రీవల్లిగా, పుష్ప రాజ్ గా అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ విలన్ గా తెరకెక్కనున్న పుష్ప ద రూల్ ఇండియాలోనే కాకుండా రష్యా, జపాన్ , చైనా లాంటి దేశాలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుని మరీ బరిలోకి దిగుతున్నారట. ఇప్పటికే దేవిశ్రీ మ్యూజిక్ సిట్టింగ్ ఫినిష్ కాగా.. ఈసారి పుష్ప 2 ఆల్బమ్ ని మరింత రంజుగా మార్చడానికి దేవిశ్రీ మరింతగా కష్టపడుతున్నాడు. పుష్ప ద రూల్ లోను అదిరిపోయే ఐటెం సాంగ్ ఉండబోతున్నట్లుగా దానికోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. 

పుష్పని నార్త్ ఆడియన్స్ ఆదరించడంతో హిందీ మర్కెట్ లో 100 కోట్లు కొల్లగొట్టిన పుష్ప ఈసారి బాలీవుడ్ నటులతో భారీ హంగామాతో హిందీ ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చే ప్లాన్ లో సుక్కు కూడా ఉన్నారట.

Allu Arjun target is 1000 crores:

Allu Arjun target is 1000 crores That the Pushpa 2 range

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ