బాలీవుడ్ ఇప్పుడు బడా హిట్ కొట్టేసి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకోవాలని చూస్తుంది. పాన్ ఇండియా మూవీస్ తో బాలీవుడ్ బాక్సాఫీసు అతలాకుతలం అవుతుంటే.. అక్కడి సెలబ్రిటీస్ కక్కలేక మింగలేక, ఆ పాన్ ఇండియా మూవీస్ పై విజయ్ సాధించాలంటూ చేతులు కాల్చుకుంటున్నారు. అజయ్ దేవగన్ దృశ్యం 2 తో 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టినా అక్కడి ఆడియన్స్ శాటిస్ ఫై అవ్వడం లేదు. ఈ ఏడాది ట్రిపుల్ ఆర్, కెజిఫ్ 2, కాంతారా సినిమాలు హిందీ సినిమాలపై ఎక్కేశాయి. అక్కడి ఆడియన్స్ ని మభ్యపెట్టాయి. బాలీవుడ్ బడా హీరోల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి.
దానితో బాలీవుడ్ మొత్తం డిఫెన్స్ లో పడింది. ఎలాగైనా హిట్ కొట్టి ప్రూవ్ చేసుకోవాలనుకుంటూ ఉండగానే.. ఏడాది గడిచిపోయింది.
తాజాగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ హిందీ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. అలాగే పాన్ ఇండియా మూవీస్ పై కూడా అనురాగ్ హాట్ కామెంట్స్ చేసాడు. సైరత్ విజయం మరాఠి ఇండస్ట్రీని నాశనం చేసింది అంటూ సైరత్ సినిమా దర్శకుడు నాగరాజ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. కాంతారా లాంటి సినిమాలు సొంతకథలతో తెరకెక్కి ప్రాంతీయ భాషలో హిట్ అయ్యి కూడా ఇండస్ట్రీలని నాశనం చేస్తున్నాయి అని, పాన్ ఇండియా మూవీస్ సక్సెస్ అయ్యి బాలీవుడ్ ఇండస్ట్రీని నాశనం చేశాయని, వాటి వల్లే హిందీ మర్కెట్ నాశనమైపోయింది అంటూ సంచలనంగా మాట్లాడాడు.
పాన్ ఇండియా మూవీస్ హిట్ అవుతుంటే.. ఆ ట్రెండ్ పైనే బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఫోకస్ చేస్తున్నారు. దానివల్ల నష్టపోతున్నారు. హిందీ ఇండస్ట్రీ నాశనమవుతుంది. పుష్ప, కాంతార, కెజిఫ్ లు హిట్ అయ్యి ఉండొచ్చు. కానీ అలాంటి కథలు బాలీవుడ్ కి ఎక్కవు. వాటినే కాపీ కొట్టి బాలీవుడ్ లో సినిమాలు తీస్తే తీవ్ర పరాభవం తప్పదు, నష్టము తప్పదు. ప్రస్తుతం బాలీవుడ్ కి కంటెంట్ ఉన్న సినిమాలు కావాలి, ఇండస్ట్రీకి ధైర్యం చెప్పే సినిమాలు కావాలి. కథల్లో కొత్తదనం ఉండాలి, అదే మళ్లీ ఇండస్ట్రీ కోలుకునేలా చేస్తుంది అంటూ అనురాగ్ కల్యాప్ సంచలనంగా మాట్లాడాడు.