Advertisementt

తండ్రి కాబోతున్న చరణ్: చిరు ట్వీట్

Mon 12th Dec 2022 03:05 PM
chiranjeevi,ram charan,upasana  తండ్రి కాబోతున్న చరణ్: చిరు ట్వీట్
Ram Charan is going to be a father తండ్రి కాబోతున్న చరణ్: చిరు ట్వీట్
Advertisement
Ads by CJ

మెగా ఫాన్స్ కి గుడ్ న్యూస్ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా రామ్ చరణ్ తండ్రి కాబోతున్న విషయాన్ని తెలియజేస్తూ అభిమానులని ఆనందంలో ముంచెత్తారు. 12 ఏళ్లుగా రామ్ చరణ్-ఉపాసనలు భార్య భర్తలుగా తీపి జ్ఞాపకాలని నెమరువేసుకుంటూ వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. చరణ్-ఉపాసన ఎప్పుడు తల్లితండ్రులవుతారా.. మెగా వంశం అభివృద్ధి చెందుతుంది అంటూ మెగా అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఉపాసనకు ఈ విషయంలో చాలా సందర్భాల్లో ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి.

తాజాగా రామ్ చరణ్-ఉపాసనలు తలితండ్రులు కాబోతున్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి ఎంతో గర్వంగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. చరణ్ ఫస్ట్ చైల్డ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామంటూ ఆయన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. హనుమంతుని ఆశీస్సులతో రామ్ చరణ్ మరియు ఉపాసన తమ మొదటి బిడ్డ కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారని ప్రేమతో చిరు-సురేఖ అలాగే ఉపాసన తల్లితండ్రులు శోభన, అనిల్ కామినేని పేర్లతో ఈ శుభవార్తని తెలియజేసారు చిరు.

మెగాస్టార్ చిరు తాత కాబోతున్నారని, రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడని తెలిసిన మెగా ఫాన్స్ అస్సలాగడం లేదు, సంతోషంతో మిఠాయిలు పంచుకుంటూ పండగ చేసుకుంటున్నారు. అటు మెగా ఫ్యామిలీ లో కూడా సెలెబ్రేషన్స్ మొదలైపోయాయి.

Ram Charan is going to be a father:

Chiranjeevi announces Ram Charan is going to be a father

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ