Advertisementt

వాల్తేర్ వీరయ్య: రవితేజ పవర్ ఫుల్ ఎంట్రీ

Mon 12th Dec 2022 12:00 PM
ravi tej,chiranjeevi,waltair veerayya  వాల్తేర్ వీరయ్య: రవితేజ పవర్ ఫుల్ ఎంట్రీ
Ravi Tej First Look And Teaser From Waltair Veerayya వాల్తేర్ వీరయ్య: రవితేజ పవర్ ఫుల్ ఎంట్రీ
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్యలో ఎనర్జిటిక్ మాస్ మహారాజ్ రవితేజ స్పెషల్ రోల్ చేస్తున్నాడు అనగానే అందరిలో ఎంతో ఆత్రుత. రవితేజ చిరు సినిమాలో ఎలాంటి రోల్ ప్లే చేస్తాడో.. ఆయన లుక్ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ అందరిలో మొదలైంది. ఇప్పటివరకు వీరయ్య గా పూనకాలు తెప్పించిన మెగాస్టార్, బాస్ పార్టీలోనూ ఉర్వశితో వేసిన చిందులు మెగా ఫాన్స్ నే కాదు, మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే రవితేజ లుక్ పై అందరిలో అంచనాలు పెంచుతూ సస్పెన్స్ క్రియేట్ చేసారు. ఆ సస్పెన్స్ కి, ఆత్రుతకి తెరదించుతూ డిసెంబర్ 12 ఉదయం 11 గంటలకు రవితేజ పవర్ ఫుల్ లుక్ రివీల్ చేసారు.

రవితేజ లుక్ ని పరిచయం చేస్తూ పోస్టర్ తో పాటుగా టీజర్ ని విడుదల చేసారు మేకర్స్. దర్శకుడు బాబీ.. రవితేజ ని సూపర్ ఎనెర్జిటిక్ పాత్రలో చూపించబోతున్నారు. విక్రమ్ కుమార్ ACP గా రవితేజ మాస్ యాక్షన్ ఎంట్రీ ఎగిరిపోయింది. చేతిలో మేకపిల్లతో దిగిన రవితేజ విలన్స్ ని తుక్కురేగ్గోట్టాడు. ఫస్ట్ టైం ఒక మేకపిల్లని ఎత్తుకుని ఓ పులి వస్తావుండాది అంటూ వాయిస్ ఓవర్ తో ఎంట్రీ ఇచ్చిన రవితేజ విలన్స్ ని చీల్చి చెండాడుతూ.. మధ్యలో ఏమ్రా వారి.. పిసా పిసా చేస్తున్నావ్.. నీకింకా సమాజం కాలే.. నేను ఎవ్వనయ్యకి యినానాని.. అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది

చిరు-రవితేజ కలయికలో శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ వాల్తేర్ వీరయ్యని దర్శకుడు బాబీ పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ జనవరి 13 కి ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. గెట్ రెడీ మాస్ ఆడియన్స్.. థియేటర్స్ లో దుమ్ము రేగాల్సిందే. 

Ravi Tej First Look And Teaser From Waltair Veerayya:

Ravi Tej First Look And Teaser From  Chiranjeevi Waltair Veerayya Unveiled

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ