బిగ్ బాస్ సీజన్ 6 లాస్ట్ వీక్ లోకి, గ్రాండ్ ఫినాలే వీక్ లోకి ఎంటర్ అయ్యింది. టాప్ 5 ఉండాల్సిన కంటెస్టెంట్స్ ఈ వారంలో టాప్ 6 ఉన్నారు. గత ఆదివారం చివరి కంటెస్టెంట్ గా ఇనాయ ఎలిమినేట్ అయ్యింది. ఆది రెడ్డి-ఇనయలలో ఇనాయ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి నాగార్జున పక్కన నిలబడింది. ఇనాయ ఎలిమినేషన్ పై ఆమె అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఫైర్ అయ్యారు. ఆమె ఎలిమినేషన్ రాంగ్ అంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. నాగార్జున, బిగ్ బాస్ యాజమాన్యం అన్ ఫెయిర్ ఎలిమినేషన్ తో ఇనాయని హౌస్ నుండి పంపేశారని అన్నారు.
ఇక టాప్ 5 ఉండాల్సిన వారు టాప్ 7 ఉండడంతో.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనుకున్నారు. కానీ ఇనాయ సింగిల్ ఎలిమినేషన్ అయ్యి టాప్ 6 ఉన్నారు హౌస్ లో. అయితే నాగార్జున ఈ వారం మరో ఎలిమినేషన్ ఉంటుంది. అది కూడా వీక్ మిడిల్ లో అంటే బుధవారం మరో ఎలిమినేషన్ ఉంటుంది అంటూ ఆడియన్స్ లో ఆసక్తి రేపారు. ఈ ఎలిమినేషన్ విషయం హౌస్ లో ఉన్న రేవంత్, శ్రీ సత్య, రోహిత్, ఆది రెడ్డి, కీర్తి, శ్రీహన్ ఎవ్వరికి తెలియదు. నాగార్జున ఆదివారం ఎపిసోడ్ ముగిస్తూ ప్రేక్షకులు ఈ వారం ఎవరిని బయటికి పంపించాలనుకుంటున్నారో బుధవారం తేలిపోతుంది అంటూ ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. అయితే ఈ బుధవారం ఎలిమినేషన్ అనేది బిగ్ బాస్ తెలుగు షో చరిత్రలోనే మొదటిసారిగా జరగబోతుంది.
గత ఆదివారం అర్ధరాత్రి నుండే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యి బుధవారం వరకు కొనసాగే ఓటింగ్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ టాప్ 6 నుండి బయటికి వెళతారో, ఎవరు టాప్ 5లో ఉంటారో అనేది ఆసక్తిగా మారింది.