పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ‘ఉస్తాద్’ రామ్ పోతినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ టైటిల్‌లో ‘ఉస్తాద్’ కాకుండా వేరే ఏదైనా పెట్టుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాకు మొదట ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్ అనుకుని.. పోస్టర్స్ కూడా విడుదల చేశారు. పోస్టర్స్ విడుదలై చాలా కాలం అవుతున్నా.. సినిమా మాత్రం సెట్స్‌పైకి వెళ్లలేదు. అందుకు కారణాలు అనేకం. మళ్లీ ఇప్పుడు అదే సినిమాకు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అని టైటిల్ మార్చి.. హడావుడిగా పూజా కార్యక్రమాలు కూడా మేకర్స్ నిర్వహించేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని కూడా వెల్లడించారు. అంతా బాగానే ఉంది కానీ.. పేరులో ఉన్న ‘ఉస్తాద్’ అనే పదమే రాపో ఫ్యాన్స్‌కి ఇబ్బందికరంగా ఉంది.
ఎందుకంటే, ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ పేరుకి ముందు పూరి జగన్నాధ్, రాపో ఫ్యాన్స్ ‘ఉస్తాద్’ అంటూ చేర్చి.. పిలుచుకుంటున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ కనుక తీస్తే.. పూరి ఆ సినిమాకి ‘ఉస్తాద్’ అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారు. ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో రామ్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఆయన పేరు ముందు ‘ఉస్తాద్’ అని చేర్చుతూ ఉంటారు. కానీ ఇప్పుడా పేరుని పవన్ కల్యాణ్ తన సినిమాకి వాడేసుకోవడంతో.. రాపో ఫ్యాన్స్ ఆ పేరు మార్చాలంటూ రిక్వెస్ట్‌లు స్టార్ట్ చేశారు. మాములుగా పవన్ కల్యాణ్ కాకుండా వేరే వాళ్లు ఈ పేరుని వాడి ఉంటే.. ఈపాటికే సోషల్ మీడియాలో యుద్ధం మొదలయ్యేది. కానీ పవన్ కల్యాణ్ అంటే రామ్‌కి కూడా చాలా ఇష్టం కాబట్టి.. రాపో ఫ్యాన్స్ రిక్వెస్ట్‌లకు దిగారు. మరి వారి రిక్వెస్ట్‌ని ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ టీమ్ ఎంత వరకు కన్సిడర్ చేస్తుందో చూడాలి.