పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా విషయంలో రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎటువంటి రచ్చ జరుగుతుందో తెలిసిందే. ఈ సినిమా స్థానంలో ఇదే కాంబినేషన్‌లో ‘థేరి’ రీమేక్ చేస్తున్నారనేలా వార్తలు రావడంతో.. మెగా ఫ్యాన్స్, పవన్ డైహార్డ్ ఫ్యాన్స్ బాగా హర్టయ్యారు. ఆల్రెడీ తెలుగులో వచ్చిన సినిమాని మళ్లీ రీమేక్ చేయడం ఏంటయ్యా..? అంటూ ‘వుయ్‌డోంట్‌వాంట్‌థేరిరీమేక్’ అనే ట్యాగ్‌తో నిరసన వ్యక్తం చేశారు. కొందరైతే హరీష్ శంకర్‌ని నిందిస్తూ కామెంట్స్ చేశారు. ఆఫ్ కోర్స్ అలాంటి వారందరినీ ఆయన బ్లాక్ చేశాడనుకోండి.. అదే వేరే విషయం. ఫ్యాన్స్ నిరసన పవన్ వరకు వెళ్లిందో.. లేదంటే ‘భవదీయుడు భగత్‌సింగ్’కే టైటిల్ మార్చారో తెలియదు కానీ.. సడెన్‌గా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అంటూ పోస్టర్.. ఆ వెంటనే పూజా కార్యక్రమాలను మేకర్స్ నిర్వహించేశారు.
అయితే ‘థేరి’ రీమేక్ కాదనేలా.. పోస్టర్ అయితే చెబుతుంది కానీ.. ఇంకా అనుమానాలు మాత్రం ఫ్యాన్స్‌లో పోలేదు. ఎందుకంటే, ఒక్కమాట హరీష్ శంకరో.. లేదంటే మైత్రీ వాళ్లో చెప్పేస్తే పోయేది. సోషల్ మీడియాలో అంత వార్ జరుగుతున్నా కూడా వారెవ్వరూ మాట్లాడలేదు. కామ్‌గా పూజా కార్యక్రమాలు నిర్వహించేశారు. దీంతో ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. అయితే హరీష్ శంకర్ చేసిన ట్వీట్‌తో ఫ్యాన్స్‌కి కూడా కాస్త క్లారిటీ వచ్చినట్లే అనిపిస్తుంది. దీంతో మీరు ఏదైనా చేయండనేలా ఫ్యాన్స్ కామెంట్స్ స్టార్ట్ చేశారు. ‘‘మే 11 నుండి డిసెంబర్ 11 వరకు.. సంవత్సరం కూడా కాలేదు.. కానీ నాకు ఎంతో ఇష్టమైన కల్యాణ్‌గారిని డైరెక్ట్ చేయడానికి 10 సంవత్సరాలు వెయిట్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఈరోజు ఉస్తాద్ భగత్‌సింగ్ మొదలైంది. మనల్ని ఎవడ్రా ఆపేది’’ అంటూ హరీష్ చేసిన ట్వీట్‌తో ఫ్యాన్స్‌కి కళ్లు తెరుచుకుంటున్నాయి.