నందమూరి బాలకృష్ణ వీరసింహ రెడ్డి లో గంభీరంగా మాస్ లుక్ తో భయపెట్టారు. వీరసింహ రెడీ లుక్, ఆయన చెప్పిన డైలాగ్స్ అన్నీ అదిరిపోయాయి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ అనేసరికి బాలయ్య పక్కన తేలిపోతుందేమో.. ఈ అమ్మాయి యంగ్, బాలయ్య కాస్త ఎజెడ్ లుక్స్ అనుకున్నారు. కానీ బాలకృష్ణ పక్కన శృతి హాసన్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది అని తాజాగా విడుదల చేసిన ఓ పోస్టర్ లుక్ తెలియజేస్తుంది. బాలయ్య-శృతి హాసన్ రొమాంటిక్ గా అదిరిపోయే ఫోజ్ లో మెస్మరైజ్ చేసారు.
బాలకృష్ణ-గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి సెకండ్ సింగిల్ సుగుణ సుందరి లిరికల్ వీడియో డిసెంబర్ 15న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు, యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్, డ్రామా, వినోదం.. ఫ్యామిలీస్ ని అలరించే అన్ని అంశాలు ఈ చిత్రంలో వుంటాయి. సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ పోస్టర్ లో బాలకృష్ణ బ్లాక్ కాస్ట్యూమ్ లో స్టైలిష్ లుక్ లో అదరగొట్టగా, శృతి హాసన్ స్టన్నర్ గా ఉంది.