Advertisementt

ఉస్తాద్ భగత్ సింగ్ గా పవన్ కళ్యాణ్

Sun 11th Dec 2022 09:15 AM
pawan kalyan,ustaad bhagat singh  ఉస్తాద్ భగత్ సింగ్ గా పవన్ కళ్యాణ్
Pawan Kalyan as Ustaad Bhagat Singh ఉస్తాద్ భగత్ సింగ్ గా పవన్ కళ్యాణ్
Advertisement
Ads by CJ

గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ అంటూ హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ ప్రకటించడమే భవదీయుడు భగత్ సింగ్ అంటూ పవన్ కళ్యాణ్ తో చెయ్యబోయే సినిమాకి టైటిల్ మాత్రమే కాదు ఫస్ట్ లుక్ కూడా గ్రాండ్ గా  రిలీజ్ చేసి అందరిలో అంచనాలు పెంచిన హరీష్ శంకర్.. ఈ మధ్యన అదే పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ విషయంలో పవన్ ఫాన్స్ చేతిలో తిట్లు తిన్నాడు. తమిళంలో హిట్ అయిన విజయ్ తేరి ని తెలుగులో భవదీయుడిగా రీమేక్ చేయబోతున్నాడని, ఒకవేళ ఆ రీమేక్ చేస్తే సూయిసైడ్ చేసుకుంటామని హరీష్ ని ఫాన్స్ బెరించారు. సోషల్ మీడియాలో హల్చల్ చేసారు. ఆ ప్రష్టేషన్ తట్టుకోలేక హారిష్ చాలామంది పవన్ ఫాన్స్ ని బ్లాక్ చేసాడు.

అయితే ఇప్పుడు ఇంకా సెట్స్ లోకి వెళ్లకుండానే పవన్ కళ్యాణ్ తో చెయ్యబోయే మూవీ టైటిల్ ని మార్చేశారు మేకర్స్. భవదీయుడు భగత్ సింగ్ ని ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చేశారు. అంటే పవన్ కళ్యాణ్ భవదీయుడిగా భగత్ సింగ్ పోరాటాలు చేస్తాడనుకుంటే.. ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ గా మారిపోయి స్టయిల్ మార్చేసాడు. టైటిల్ మాత్రమే కాదు.. టైటిల్ తో పాటుగా లుక్ కూడా చేంజ్ చేసారు. భవదీయుడు బైక్ మీదనే ఉస్తాద్ పవన్ కళ్యాణ్ ఇంటెన్స్ లుక్ లో కొత్తగా డిజైన్ చేసి వదిలారు.

మరి తేరి రీమేక్ విషయంలో ఆగ్రహంతో ఉన్న పవన్ ఫాన్స్ ఇప్పుడు ఈ టైటిల్ చూసాక శాంతిస్తారేమో చూడాలి. ఈ ప్రాజెక్ట్ అతి త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టుగా మేకర్స్ చెబుతున్నారు.

Pawan Kalyan as Ustaad Bhagat Singh:

Pawan Kalyan transforms as Ustaad Bhagat Singh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ