నిన్న శుక్రవారం డిసెంబర్ 9 న థియేటర్స్ లో పొలోమని 17 సినిమాలు పోగయ్యాయి. చిన్న చిన్న సినిమాలన్నీ వదిలించుకోవాలనే తాపత్రయంతో నిర్మాతలు వరసబెట్టి థియేటర్స్ దారి పట్టించారు. అందులో మూడో నాలుగో సినిమాలు మత్రమే ప్రేక్షకులకి రిజిస్టర్ అయిన సినిమాలు. సత్య దేవ్ గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం, ముఖచిత్రం, లెహరాయి, చెప్పాలని ఉంది.. ఇలా కొద్ది సినిమాలు మాత్రమే ప్రేక్షకుల మదిలోకి వెళ్లాయి. మిగతా సినిమాలేవీ కనీసం ఆడియన్స్ కి తెలిసే అవకాశం కూడా లేవు.
ఈ 17 సినిమాల్లో ఏ ఒక్కటి ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. కొద్దిగా అంచనాలున్న సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం కానీ, పంచతంత్రం, ముఖ చిత్రం ఇవేమి కంటెంట్ తో ప్రేక్షకులని మెప్పించలేదు. కొన్ని సినిమాలని కనీసం క్రిటిక్స్ కానీ, ఆడియన్స్ కానీ పట్టించుకున్న పాపానపోలేదు. అలా చడీ చప్పుడు లేకుండా విడుదలై కామ్ గా వెళ్లిపోతాయి. థియేటర్స్ లో వచ్చాయి, సినిమా విడుదల చేశామన్నట్టుగా ఉన్నాయి వాటి పని.
పొలోమంటూ థియేటర్స్ మీద దండెత్తినా ఒక్క సినిమా కూడా బావుంది అనే మాటే వినిపించలేదు. సోషల్ మీడియా హడావిడి లేదు, రివ్యూ రైటర్స్ హంగామా లేదు అన్నట్టుగా 17 సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోవడానికి రెడీగా ఉన్నాయి. దానితో ప్రేక్షకులు బాబోయ్ ఈ వీకెండ్ ఇంత డల్ గా బోరింగ్ గా ఉందేమిట్రా బాబు అంటున్నారు.