బిగ్ బాస్ సీజన్ 6 లో ఊహించని ఎలిమినేషన్స్ చాలానే జరిగాయి. అందులో ముఖ్యంగా చంటి, సూర్య, గీతూ ఎలిమినేషన్ తర్వాత బాలాదిత్య ఎలిమినేషన్ ఎవ్వరి ఊహకి అందలేదు. వీళ్లంతా టాప్ 5 లో ఉంటారనుకుంటే మధ్యలోనే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయారు. బిగ్ బాస్ సీజన్ 6 నామినేషన్స్ లో ఓటింగ్ తో సంబంధం లేకుండా ఎలిమినేషన్స్ జరుగుతూన్నాయనే టాక్ చాలా రోజుల నుండి నడుస్తుంది. కానీ ఇప్పుడు ఈ చివరి వారం అది నిజమని నమ్మేలా చేశారు బిగ్ బాస్ వాళ్ళు.
కారణం స్ట్రాంగ్, టాప్ 5 కాదు టాప్ 2 అనుకున్న ఇనాయ సుల్తానాని ఎలిమినేట్ చెయ్యడమే. ఈ వీక్ లో ఏ ఇద్దరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో ఎవ్వరూ పెద్దగా జుట్టు పీక్కోలేదు, ఆలోచించలేదు. కారణం కీర్తి లేదు అంటే శ్రీ సత్య ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారనుకున్నారు. వారిద్దరికీ ఓట్స్ తక్కువ పడుతున్నాయని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ సేవ్ అయ్యి ఇనాయ సుల్తానా ఎలిమినేట్ అవడం ఎవ్వరికి అర్ధం కావడం లేదు. ఓటింగ్ లో రేవంత్ తర్వాత రోహిత్ ఉండగా, మూడో స్థానంలో ఇనాయ ఉంది.
చివరి ప్లేస్ లో శ్రీ సత్య, కీర్తి ఉన్నారు. కానీ మూడో ప్లేస్ లో ఉన్న ఇనాయ ఎలా ఎలిమినేట్ అయ్యిందో అంటూ ఆమె అభిమానులు తల పట్టుకుంటున్నారు. విన్నర్ మెటీరియల్ రేవంత్ కె గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో ఉన్న ఇనాయ చివరి వారంలో ఎలిమినేట్ అవడంపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాప్ 5 లో ఇనాయ పక్కా అనుకుంటే సడన్ గా బిగ్ బాస్ ఇలా ఎలిమినేట్ చెయ్యడం ఏమిటి అంటూ మండి పడుతున్నారు. బిగ్ బాస్ కావాలనే ఇనాయని ఎలిమినేట్ చేసారు. ఇది అన్ ఫెయిర్ అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.