సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో దిల్ రాజుని ఒంటరి వాడిని చేసింది నిర్మాతల మండలి. ఓ డబ్బింగ్ సినిమాని పండగ సీజన్ లో విడుదల చెయ్యనివ్వమని దిల్ రాజు చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ ఆయన సినిమాకే నిర్మాతల మండలి ఎసరు పెట్టింది. టాలీవుడ్ నిర్మాతల మండలి ఇప్పుడు దిల్ రాజు నిర్మిస్తున్న వారిసు చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చెయ్యనివ్వమంటూ లేఖ రాసినా.. దిల్ రాజు నేను అందరికన్నా ముందే చెప్పాను వారిసు సంక్రాంతికి రిలీజ్ అని కూల్ గా చెప్పారు. అటు తమిళనాట ఈ విషయమై వివాదం చెలరేగింది.
అయితే ఇప్పుడు బడా నిర్మాత సురేష్ బాబు దిల్ రాజుకి సపోర్ట్ గా మట్లాడారు. సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు ఎందుకు విడుదల కాకూడదు. మన తెలుగు సినిమాలు ఎక్కడైనా, ఎప్పుడైనా విడుదలై సంచనాలు సృష్టిస్తున్నాయి. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలను అన్ని భాషల ప్రేక్షకులు ఆదరించారు. మన సినిమాలు అక్కడ విడుదలైనప్పుడు వారు ఇబ్బంది పడ్డారు. అవి చిన్న చిన్న ఇబ్బందులు. లోకల్ గా ప్రోబ్లెంస్ అయితే ఉంటాయి. మంచి సినిమా అయితే ఆడుతుంది, లేదంటే రెండో రోజే థియేటర్స్ లో ఎత్తేస్తారు. ఇదంతా ఓ బిజినెస్, మన సినిమాలని ఏ భాషలోనూ చులకన చెయ్యడం లేదు. పెద్ద సినిమాలు, మంచి సినిమాలకి థియేటర్స్ ఎక్కువ కేటాయిస్తారు,
సినిమాలో దమ్ముంది అని నమ్మే సినిమాలకి ఎక్కువ థియేటర్స్ ఇస్తారు, మన సినిమాలు ఇతర భాషల్లో లెక్కకి మించిన థియేటర్స్ లో విడుదలై ఆడాయి. ఇక్కడ భాషతో సంబంధం లేదు. ప్రస్తుతం సినిమాలు అన్ని భాషల్లో ఆడుతున్నాయి. అలాంటప్పుడు ఇక్కడ డబ్బింగ్ సినిమాలపై నిషేధం ఎంతవరకు కరెక్ట్ అంటూ సురేష్ బాబు దిల్ రాజు వారిసు వివాదంపై ఆయనకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు.