మెగా హీరో వరుణ్ తేజ్ తొలిప్రేమతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వకుముందే వెంకీ అట్లూరి నటుడిగా అలాగే రైటర్ గా అందరికి సుపరిచితుడే. వరుణ్ తేజ్ తొలిప్రేమ హిట్ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను చేసిన ఆయన నితిన్ తో రంగ్ దే మూవీ చేసాడు. ఇప్పుడు ధనుష్ తో తెలుగు, తమిళంలో సర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ గప్ చుప్ గా నిశ్చితార్ధం చేసేసుకున్నాడు.
ఈ విషయాన్ని వెంకీ అట్లూరినే కూల్ గా సోషల్ మీడియాలో షేర్ చేసాడు. వెంకీ అట్లూరి తన స్నేహితులు, కొద్దిమంది బంధువుల మధ్యన నిశ్చితిర్దాన్ని చాలా సింపుల్ గా కానిచ్చేసి ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు. వెంకీ అట్లూరి ఎంగేజ్మెంట్ కి టాలీవుడ్ నుండి ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ వైఫ్, నిర్మాత స్వప్న దత్ ఇంకా కొద్దిమంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. త్వరలోనే వెంకీ అట్లూరి పెళ్లి జరగబోతున్నట్లుగా తెలుస్తుంది.