ఎన్టీఆర్ ఫాన్స్ లో ఇప్పుడు సంకట స్థితి ఏర్పడింది. తమ అభిమాన హీరో పబ్లిక్ లో దర్శనమిస్తున్నాడు అని హ్యాపీ గా ఫీలవ్వాలో, లేదంటే NTR30 మొదలు పెట్టకుండా విదేశీ యాత్రలు చేపడుతున్నాడని బాధపడాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ట్రిపుల్ ఆర్ రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ రీసెంట్ గా ఓ యాడ్ షూట్ లో పాల్గొన్నారు తప్ప NTR30 సెట్స్ లోకి వెళ్లకపోవడంపై ఎన్టీఆర్ ఫాన్స్ గుర్రుగానే ఉన్నారు. అదిగో ఇదిగో ప్రీ ప్రొడక్షన్ పనులు అంటూ అప్ డేట్ ఇస్తున్నారు కానీ వారు కూల్ అవ్వడం లేదు.
ఎన్టీఆర్-కొరటాల ఎప్పుడెప్పుడు సెట్స్ మీద సందడి చేస్తారా అని వారు తెగ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఓ నెల రోజుల పాటు అమెరికా ట్రిప్ వెయ్యడం, అక్కడే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి ప్లాన్ చేయడం అన్ని ఫాన్స్ కి ఓ పక్క సంతోషం, మరోపక్క ఆందోళన కలిగిస్తున్నాయి. అంటే ఎన్టీఆర్ మళ్ళీ ఫ్యామిలీతో కలిసి జనవరి 10 సంక్రాంతి ముందు హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. అంటే NTR30 పండగ ముందు కూడా మొదలు కాదు, జనవరి నెలాఖరు అయినా అవ్వొచ్చు.
ఇప్పుడు అదే దిగులు ఎన్టీఆర్ ఫాన్స్ లో కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఎన్టీఆర్ అమెరికా ట్రిప్ వెళ్లాడని సంతోషపడాలో, NTR30 షూటింగ్ మొదలు కాలేదని బాధపడాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఫాన్స్ కొట్టుమిట్టాడుతున్నారు.