సత్య దేవ్ సీరియస్ పాత్రలకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని గాడ్ ఫాదర్ లో ఆయన జయదేవ్ కేరెక్టర్ ప్రూవ్ చేసింది. లూసిఫర్ లో వివేక్ ఒబెరాయ్ కేరెక్టర్ ని కనిపించకుండా సత్యదేవ్ తన జయదేవ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడు. గాడ్ ఫాదర్ లో సత్యదేవ్ కి విపరీతమైన పేరొచ్చింది. నెగెటివ్ కేరెక్టర్ లో నయన్ భర్తగా అతని పెరఫార్మెన్స్ కి విజిల్స్ వేశారు. అలాగే బ్లఫ్ మాస్టర్, గాడ్ సే ఇవన్నీ సీరియస్ నెస్ ని మెయింటింగ్ చేసే కేరెక్టర్స్ కావడంతో సత్యదేవ్ బాగా హైలెట్ అయ్యాడు. కానీ రీసెంట్ గా ఆయన రొమాంటిక్ యాంగిల్ లో ఎక్స్ పోజ్ అవుతూ చేసిన గుర్తుందా శీతాకాలం సినిమా మాత్రం ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది.
సత్య దేవ్ కి లవ్ స్టోరీస్ బావుండవు, అసలు హీరోయిన్ తమన్నా సత్యదేవ్ పక్కన సూట్ కాలేదు అంటూ ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. అటు లుక్స్ విషయంలోనూ సత్య దేవ్ తేలిపోయాడనే మాట వినిపిస్తుంది. అతను ఎంత కష్టపడి నటించినా కథ, కథనాలు బలంగా లేకపోవడం మెయిన్ మైనస్ అయ్యింది. సత్యదేవ్ ఎంతగా ఎఫర్ట్స్ పెట్టినా.. అతనికి లవ్ స్టోరీస్ సెట్ కావనే అభిప్రాయాలు సినిమా చూసిన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు.
అంటే సత్యదేవ్ పొలిటికల్ థ్రిల్లర్స్, సస్పెన్స్ ట్రిల్లర్స్, అలాగే నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్స్ లో అయితే పర్ఫెక్ట్ గా సూటవుతాడు, ఇలా ప్రేమ కథలు పట్టుకుంటే అస్సలు వర్కౌట్ అవ్వదని నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక గుర్తుందా శీతాకాలానికి అటు క్రిటిక్స్, ఇటు ఆడియన్స్ అందరూ ఒకేలాంటి రెస్పాన్స్ ఇవ్వడంతో ఈ సినిమా ప్లాప్ లిస్ట్ లోకి చేరిపోయినట్లే కనిపిస్తుంది.