ఈటీవీలో మల్లెమాల యాజమాన్యం ఢీ డాన్స్ రియాలిటీ షో ని గత 14 సీజన్స్ ని ఎంతో గ్రాండ్ గా సక్సెస్ చేసింది. ఢీ 14th సీజన్ రీసెంట్ గా రవితేజ అతిధిగా ముగిసింది. ఢీ డాన్స్ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్స్ కి స్టార్ హీరోలని ఇన్వైట్ చేసి వారి చేతుల మీదుగా విన్నర్స్ కి ప్రైజ్ మనీ ఇప్పిస్తూ వాళ్ళ టీఆర్పీ పెంచుకోవడమే కాదు, అదే ఢీ షో నుండి ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్స్ గా పేరు తెచ్చుకున్నారు. వారిలో ముఖ్యంగా గణేష్ మాస్టర్, శేఖర్, జానీ మాస్టర్ లాంటి వాళ్ళు టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలకి కొరియోగ్రఫీ చేస్తూ ఫెమస్ అయ్యారు.
ఢీ సీజన్ 14 ఈ వారమే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తో ముగియడంతో అప్పుడే ఢీ 15th సీజన్ కి ఏర్పాట్లు చెయ్యడం కాదు, గ్రాండ్ గా ఓపెనింగ్ ఎపిసోడ్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసారు. ఢీ డాన్స్ సీజన్ 15 గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ కి టాప్ కొరియోగ్రాఫర్ ప్లస్ దర్శకుడు ప్రభుదేవా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఢీ డాన్స్ స్టేజ్ పై చాలా స్టయిల్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు గనక నేను ఆడిషన్స్ కి వెళితే డాన్సర్ గా కనీసం సెలెక్ట్ కూడా కాను అంటూ ఫన్నీ గా కంటెస్టెంట్స్ లో ఊపు తీసుకువచ్చారు. ఇక ఈ సీజన్ కూడా ప్రదీప్ మాచిరాజే యాంకరింగ్ చేయబోతున్నట్లుగా రివీల్ చేసారు.
ఢీ సీజన్ 15 ని ప్రభుదేవా ప్రమోట్ చేస్తుండగా.. శ్రద్ద దాస్ జెడ్జ్ గా కన్ ఫర్మ్ అవ్వగా.. ఇక మెంటర్స్ గా ఎవరు వ్యవహరిస్తారు, ఈ షో ఎలా ఉండబోతుంది అనేది వచ్చే బుధవారం గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ లో తెలిసిపోతుంది.