యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వెకేషన్ మూడ్ లో ఉన్నారు. ఈమధ్యనే ఓ యాడ్ షూట్ పూర్తి చేసి ఆయన ఫ్యామిలీతో కలిసి US ట్రిప్ వేశారు. నిన్న శుక్రవారం భార్య ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి ఆయన ఎయిర్ పోర్ట్ లో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. NTR30 స్టార్ట్ అవ్వడానికి ఇంకాస్త టైమ్ ఉండడంతో ఎన్టీఆర్ భార్య పిల్లలతో కలిసి అమెరికాలో ఓ నెల రోజుల పాటు ఎంజాయ్ చెయ్యడానికి ఫ్లైట్ ఎక్కారు.
అక్కడే ఓ నెల రోజులు పాటు ఫ్యామిలీ వెకేషన్ తో రిలాక్స్ అయ్యాక ఎన్టీఆర్ హైదరాబాద్ కి వచ్చి NTR30 పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తుంది. దర్శకుడు కొరటాల శివ కూడా NTR30 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే అనిరుధ్ తో NTR30 మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్న కొరటాల తర్వాత లొకేషన్స్ వేటలో బిజీ అవుతారని తెలుస్తుంది. అయితే హీరోయిన్ విషయమై ఎన్టీఆర్ తో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకుంటారని, ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది.
NTR30 షూటింగ్ స్టార్ట్ అయితే గ్యాప్ ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ ఇప్పుడే ఈ టైమ్ లో కాస్త ఫ్యామిలీతో సమయం గడుపుదామని ఆయన అమెరికా వెళ్లినట్లుగా తెలుస్తుంది.