బిగ్ బాస్ సీజన్ 6 చివరి వారంలోకి ఎంటర్ అవుతుంది. వచ్చే ఆదివారం డిసెంబర్ 18 న బిగ్ బాస్ 6 గ్రాండ్ ఫినాలే కి యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. టాప్ 5 లోకి ఎవరు ఎంటర్ అవుతారు, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నడుస్తుంది. రేవంత్, శ్రీహన్ పక్కాగా టాప్ 5 లో ఉంటాడు. ఎందుకంటే శ్రీహన్ ఇప్పటికే టాప్ 5 ని కన్ ఫర్మ్ చేసుకున్నాడు. ఇక ఆది రెడ్డి, రోహిత్, ఇనాయ సుల్తానాలు టాప్ అంటున్నప్పటికీ.. ఇప్పుడు ఆది రెడ్డి, ఇనాయలది డౌట్ కొడుతోంది.
మరోపక్క ఈ వారం కీర్తి-శ్రీ సత్యలలో ఎవరు ఎలిమినేట్ అవుతారో.. లేదంటే ఇద్దరూ ఎలిమినేట్ అవుతారో అనే విషయము తెగడం లేదు. ఇక్కడ శ్రీ సత్యకి మొన్నటివరకు నెగిటివిటి ఉన్నప్పటికీ.. ఆమె ఫ్యామిలీ వీక్ తర్వాత స్ట్రాంగ్ గా గేమ్ ఆడడం, ఫ్రెండ్స్ అని కూడా చూడకుండా గొడవపడటం లాంటి వాటితో శ్రో సత్య సేఫ్ గానే కనబడుతుంది. కీర్తి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ.. ఆమె చేతి వేలు ఆమెని వెనక్కి నెట్టింది. ఇక రోహిత్ గ్రాఫ్ ఈ మధ్యన బాగా పెరిగింది. సామాన్యుడు ఆది రెడ్డి స్ట్రాంగ్ గానే కనబడుతున్నాడు.
కానీ ఈ వారం రేవంత్ ఓటింగ్ లో టాప్ లో ఉంటే.. తర్వాత రోహిత్ ఉన్నాడు. ఇక మూడో ప్లేస్ లో ఆది రెడ్డి, నాలుగో స్థానంలో ఇనాయ, ఐదో ప్లేస్ లో శ్రీ సత్య, ఆరో స్థానంలో కీర్తి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఫైనల్లీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే శ్రీ సత్య, కీర్తి.. ఒక్కరే అయితే కీర్తి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఈ వారం ఎవరు వెళతారో అనేది ఈ రోజు నైట్ కల్లా తేలిపోతుంది. లీకుల వీరులు బయటపెట్టేస్తారులే..