తెలుగులో నాని, బాలయ్య లాంటి హీరోలతో నటించినా రాని క్రేజ్ కన్నడ సినిమాలతో అక్కడ నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ హరిప్రియకి గత కొంతకాలంగా టాలీవుడ్ లో అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. కన్నడలో పలు సినిమాలతో బిజీగా ఉంటున్న హరిప్రియ కన్నడ నటుడు KGF విలన్ గా గుర్తింపు పొందిన వసిష్ఠ సింహ ప్రేమలో పడింది. వసిష్ఠతో హరిప్రియ ఎప్పటినుండో డేటింగ్ లో ఉంది. ఈ మధ్యన బెంగుళూర్ ఎయిర్ పోర్ట్ లో వీరిద్దరూ కలిసి కనబడి మీడియాకి దొరికిపోయారు. ఇప్పటివరకు సైలెంట్ గా డేటింగ్ చేసిన ఈ జంటని మీడియా ఎక్స్పోజ్ చెయ్యడంతో.. వీరి లవ్ బయటపడింది.
రీసెంట్ గానే హరిప్రియ వీరి ప్రేమని కన్ ఫర్మ్ చేసింది. తాజాగా వసిష్ఠ సింహ-హరిప్రియలు ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. హరిప్రియ వసిష్ఠ ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్ధం చేసుకున్నారు. తమ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హరిప్రియ-వసిష్ఠలు తమ జంటని ఆశీర్వదించామని కోరారు. ఇక హరిప్రియ కాబోయే వాడితో కలిసి నిశ్చితార్థంలో మెరిసిపోయింది. కుటుంబ సభ్యుల మధ్యన జరిగిన ఈ నిశ్చితార్ధం ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.