జాన్వీ కపూర్ అందాలు ఆరబొయ్యడంపై ఎన్ని కామెంట్స్ పడుతున్నా.. ఎంత ట్రోల్ జరుగుతున్నా జాన్వీ కపూర్ మాత్రం తగ్గేదేలే అంటూ ఇంకా ఇంకా శృతి మించిపోతుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా గ్లామర్ షో చేస్తుంది. పార్టీ అయినా పబ్ అయినా, ఆఖరికి వర్కౌట్స్, పెళ్లిళ్లు ఏ విషయంలో అయినా జాన్వీ కపూర్ పొదుపు సూత్రం బాగా పాటిస్తుంది. అది ఒక్క బట్టల విషయంలోనే. క్లివేజ్ షో కి కేరాఫ్ అడ్రెస్స్ జాన్వీ కపూర్ అనేలా ఆమె రెచ్చిపోతుంది.
తాజాగా జాన్వీ కపూర్ మాల్దీవుల్లో తేలింది. అక్కడి సముద్రపు ఒడ్డున బీచ్ లో బికినీ షో చేస్తూ రెచ్చిపోతుంది. ఎవరేమనుకుంటే నాకేంటి.. నా గ్లామర్ పిక్స్ చూడండి అంటూ జాన్వీ కపూర్ తన పిక్స్ ని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. సినిమాల విషయంలో అడుగడుగునా ఫెయిల్ అవుతున్న జాన్వీ కపూర్ గ్లామర్ విషయంలో రోజురోజుకి అప్ డేట్ అవుతుంది. రీమేక్స్ ని నమ్ముకుని సినిమాలు చేస్తుంది. కానీ అవేమి ఆమెకి సక్సెస్ అందించడం లేదు.
సినిమాల కన్నా అందాలు ఆరబొయ్యడంపై ఆమె ఎక్కువగా శ్రద్ద పెడుతుందేమో అనిపించేలా జాన్వీ గ్లామర్ షో రోజు రోజుకి శృతి మించిపోతుంది. ఎద అందాలు చూపించడమే నా టార్గెట్ అనే రీతిలో ఆమె కనిపిస్తుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ మాల్దీవ్స్ రచ్చ సూపర్ హాట్ గా సర్క్యులేట్ అవుతుంది.