మహేష్ బాబు-త్రివిక్రమ్ లు ప్రస్తుతం ముంబై టు దుబాయ్ అంటున్నారు. ముంబైలో మహేష్ యాడ్ షూట్ ముగించుకుని అటునుండి అటే దుబాయ్ వెళ్లనున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్, థమన్ లు కలిసి SSMB28 మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ రానున్నారు. ఇక SSMB28 ఫస్ట్ షెడ్యూల్ పై రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ఆ షెడ్యూల్లో తెరకెక్కించిన యాక్షన్ సీక్వెస్ పనికిరాకుండా పోయాయనే టాక్ నడుస్తుంది. ఇక సెకండ్ షెడ్యూల్ కి టీమ్ రెడీ అవుతుంది. డిసెంబర్ 15 నుండి సెకండ్ షెడ్యూల్ ని హైదరాబాద్ లోనే మొదలు పెట్టనున్నారు.
ఈ షెడ్యూల్ లో హీరోయిన్ పూజ హెగ్డే జాయిన్ అవ్వబోతుంది. మహేష్ తో రెండోసారి రొమాన్స్ చేస్తున్న పూజ హెగ్డే ఈమధ్యన కాలు ఫ్రాక్చర్ అవ్వడంతో కొద్దిరాజులపాటు రెస్ట్ తీసుకుని.. ప్రస్తుతం తన కాలు సెట్ అవడంతో షూటింగ్స్ కి రెడీ అవుతుంది. ముందుగా ఆమె హైదరాబాద్ కి వచ్చి మహేష్ తో SSMB28 షూటింగ్ లో జాయిన్ అవ్వబోతుంది.
ఈ నెల 15 నుండి మొదలు కాబోయే ఈ షెడ్యూల్ లో మహేష్-పూజ హెగ్డే లపై త్రివిక్రమ్ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.