డీజే టిల్లు లో హీరోయిన్ నేహా శెట్టి తో రొమాంటిక్ గా రెచ్చిపోయి కామెడీ చేసిన సిద్దు జొన్నలగడ్డకి ఆ సినిమా సూపర్ హిట్ ఇచ్చింది. నేహా శెట్టి కేరెక్టర్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ.. ఆమె గ్లామర్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. డీజే టిల్లు సీక్వెల్ గా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ లో హీరోయిన్ ని మార్చేశారు. ముందు శ్రీ లీల ని అనుకున్నారు. తర్వాత ఆమె ప్లేస్ లోకి అనుపమ వచ్చింది. అనుపమ ఆ సినిమాలో లిప్ లాక్ కిస్సులు పెట్టలేక ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది అన్నారు. అనుపమ తో షూటింగ్ మొదలు పెట్టాకే సిద్దు డామినేషన్ తట్టుకోలేక అనుపమ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది అనే టాక్ కూడా ఉంది.
ఇక అనుపమ ప్లేస్ లోకి మడోన్నా సెబాస్టియన్ వచ్చింది. అయితే ఆమె అన్నిటికి సిద్ధమైనా.. ఫోటో షూట్ చేసాక ఆ కేరెక్టర్ కి సెట్ అవ్వని కారణంగా మడోన్నా ని తీసేశారట. దానితో సిద్దు హగ్గులకి, ముద్దులకి సెట్ అయ్యే హీరోయిన్ కోసం మరోసారి మేకర్స్ వేట మొదలు పెట్టారు. ఈ లోపు హిట్ 2 లో అడివి శేష్ తో రొమాంటిక్ యాంగిల్ చూపించిన మీనాక్షి చౌదరి అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. మీనాక్షి అయితే ఈ కేరెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూటవుతుంది అనే ఆలోచనలో టిల్లు టీమ్ కూడా ఉందట.
మరి నేహా శెట్టి లా గట్స్ ఉన్న ఏ హీరోయిన్ టిల్లు స్క్వేర్ లో కనిపిస్తుందో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉంటే.. సిద్దు ఇంతమంది హీరోయిన్స్ మారుస్తున్నాడా.. నువ్వు మాములోడివి కాదయ్యా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.