మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో బిజీగా వున్నారు. జనవరి 13 సంక్రాంతి స్పెషల్ గా వాల్తేర్ వీరయ్య బాక్సాఫీసు ఫైట్ షురూ చేసింది. దానితో ఈ మూవీ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి ప్రమోషన్స్ లోకి దిగాలని దర్శకుడు బాబీ చూస్తున్నాడు. దానిలో భగంగా చిరు-శృతి హాసన్ పై డ్యూయెట్ ని విదేశాల్లో ప్లాన్ చేశారు మేకర్స్. శృతి హాసన్ తో చిరు రెండు సాంగ్స్ కోసం యూరప్ బయలు దేరివెళ్ళింది వాల్తేర్ వీరయ్య టీమ్.
దానితో మెగాస్టార్ చిరు కూడా తన ఫ్యామిలీతో అంటే భార్య సురేఖ, తన పెద్ద కూతురు సుశ్మిత, ఆమె పిల్లలు, శ్రీజ కూతురు తో కలిసి మెగాస్టార్ చిరంజీవి యూరప్ ఫ్లైట్ ఎక్కారు. చిరంజీవి యూరప్ షెడ్యూల్ పై అప్ డేట్ ఇస్తూ.. సరదాగా ఫ్యామిలీ తో అటు విహార యాత్ర, హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర 😊 #EuropeBeckons #WaltairVeerayya అంటూ భార్య, కూతురు, మానవరాళ్లతో చిరు పిక్ ని, ఫ్లైట్ లో హీరోయిన్ శృతి హాసన్ తో కలిసి ఉన్న పిక్ ని ట్విట్టర్ లో షేర్ చేసారు. అదే సమయంలో నిర్మాతలు మైత్రి వారు కూడా Shooting for 2 songs in Europe ❤️🕺🏻💃🏻 #WaltairVeerayya ❤️🔥 అంటూ అప్డేట్ అవదిలారు.
ఆ పిక్స్ చూసిన మెగా ఫాన్స్ అటు హీరోయిన్ శృతి హాసన్, ఇటు భార్య సురేఖ మధ్యలో మెగాస్టార్ అంటూ ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు.