ఇప్పుడు హీరోయిన్స్ తల్లయినా తగ్గేదేలే అంటూ రెచ్చిపోతున్నారు. పెళ్ళయ్యి ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూ నటనకు దగ్గరగానే ఉంటున్న హీరోయిన్లు.. ఇప్పుడు తల్లయిన నెల లోపులోనే జిమ్ లో వర్కౌట్స్ చెయ్యడం, యోగా సెషన్స్ అంటూ ఒళ్ళు తగ్గించుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. శ్రీయ శరన్ అయితే బేబీ పుట్టిన విషయాన్ని చాలా లేట్ గా రివీల్ చేసింది. ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో సైలెంట్ గా అజ్ఞాతంలోకి వెళ్లి బేబీ పుట్టాక బికినీ షోస్ చేస్తుంది. ఇక ప్రణీత సుభాష్, బేబీ బంప్ ఫోటో షూట్స్ మాత్రమే కాదు, బాబీ పుట్టిన రెండు నెలలకే వర్కౌట్స్ లో వాలిపోయింది.
కాజల్ అయితే ఇండియన్ 2 సినిమా సెట్స్ లో ఉంది. కాజల్ పెళ్లి, బాబు కరోనా సమయంలోనే కంప్లీట్ చేసి కొద్ది నెలల గ్యాప్ తో బరువు తగ్గి ఇండియన్ 2 సెట్స్ లోకి వెళ్ళిపోయింది. ఇక బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ పెళ్లి, ప్రెగ్నెంట్, డెలివరీ, బేబీ అన్ని విచిత్రంగానే జరిగిపోయాయి. బేబీ పుట్టిన నెల లోపే అలియా భట్ యోగా సెషన్స్ కి హాజరైపోతుంది. అనుష్క యోగా లో అలియా భట్ యోగా చేస్తుంది. వీరంతా తల్లయినా తగ్గేదేలే అంటూ గ్లామర్ ఫోటో షూట్స్ తో మళ్ళీ మేము నటనకు రెడీ.. అవకాశాలు ఇస్తే నిరూపించుకుంటామంటున్నారు.
ఒకప్పుడు పెళ్లి అంటే భయపడిపోయేవారు, ఇప్పుడు పెళ్లి చేసుకుని కొంతమంది గ్లామర్, అందం పోకుండా సరోగసి ద్వారా తల్లవుతుంటే.. కొంతమంది నేచురల్ పద్ధతితో తల్లయ్యి.. మళ్ళీ నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నారు.