జబర్దస్త్ లో అనసూయ ప్లేస్ ని కొన్నాళ్ళు రష్మీ రీ ప్లేస్ చేసింది. తర్వాత మల్లెమాల యాజమాన్యం కొత్త యాంకర్ సౌమ్యని దింపింది. సౌమ్య సీరియల్ ఆర్టిస్ట్. ఆమె తమిళం నుండి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మాయి. తమిళ సీరియల్స్ నుండి పాపులర్ అయ్యి ఈటివి సీరియల్ చేసి ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ పై యాంకర్ గా మారింది. అనసూయ తర్వాత ఎవరైనా క్రేజీ గ్లామర్ యాంకర్ స్టేజ్ పై కనబడుతుంది అనుకుంటే.. రష్మీ నే తెచ్చారు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండిటిని రష్మిని హ్యాండిల్ చేసింది. తెలుగు రాకపోయినా, గ్లామర్ తో మ్యానేజ్ చేసిన రష్మీ ని ఎక్స్ట్రా జబర్దస్త్ కి ఉంచి జబర్దస్త్ నుండి తప్పించి సౌమ్యని తీసుకొచ్చింది యాజమాన్యం.
సౌమ్య యాంకరింగ్ బుల్లితెర ప్రేక్షకులకి నచ్చడం లేదు. ఆమె గ్లామర్ కూడా అంతంతమాత్రంగానే వుంది. ఏజ్ ఎక్కువగా కనిపిస్తుందా అనిపించేలా ఆమె లుక్స్ ఉంటున్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. అలాగే సౌమ్య చాలా ఫాస్ట్ గా మాట్లాడేస్తుంది. పంచ్ వేస్తుంది. కానీ సీరియస్ గా చెప్పడంతో ఆ పంచ్ తో నవ్వించలేకపోతుంది. కమెడియన్స్ తో స్టేజ్ పై వేసే డాన్స్ కూడా అంతంతమాత్రగానే ఉంది. అనసూయ గ్లామర్ షో, ఆమె వాక్చాతుర్యం ముందు సౌమ్య అడుగడుగునా తేలిపోతుంది. అనసూయ వెళ్ళిపోతే అంతకుమించిన యాంకర్ ని తేవడం మానేసి.. ఇలా ఈ అమ్మాయిని తెచ్చి పెట్టడం ఎవ్వరికి లేదు.
అనసూయ అంత కాకపోయినా కనీసం రష్మీ అయినా ఉంటే బావుండేది. సౌమ్య ని తీసేసి రష్మీ నే కొనసాగించండి సర్దుకుపోతామంటున్నారు. మరి సౌమ్య కూడా కొద్దిరోజులు పొతే అన్ని నేర్చుకుంటుదని.. అప్పటివరకు ఓపికపడితే పోలా అంటున్నారు కొంతమంది.