చిరంజీవి తో ఎలాగైనా సినిమా చెయ్యాల్సిందే.. ఈ ఆలోచన, కసి ఎవరిదో కాదు, లైగర్ మూవీ తో నిండామునిగిన పూరి జగన్నాథ్ ది. లైగర్ మూవీ దెబ్బకి మడి కట్టుకుని బాధపడుతూ ఇంట్లోనే కూర్చున్నాడు పూరి అనుకుంటున్నారేమో. కాదు కథలు రాసుకుంటూ పూరి పనిలో పడిపోయాడనే టాక్ మొదలయ్యింది. లైగర్ డిసాస్టర్ తో డిస్ట్రిబ్యూటర్స్ బెదిరింపులు, ఈడీ ప్రశ్నలతో సతమతమయిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం కొత్త కథని డెవెలెప్ చేసే పనిలో బిజీగా వున్నాడట.
ఆయనకి ఇష్టమైన చిరు తో సినిమా చెయ్యాలనే కసి తో.. చిరుకి లైన్ చెప్పి ఒప్పించేసాడని కూడా అంటున్నారు. గతంలోనే ఆటో జానీ స్క్రిప్ట్ తో చిరూ చుట్టూ తిరిగిన పూరి జగన్నాథ్ ఆ సినిమా చెయ్యకపోయినా.. గాడ్ ఫాదర్ లో స్పెషల్ రోల్ చేసాడు. అయితే తాజాగా చిరు తో ఉన్న అనుబంధంతో పూరి జగన్నాథ్ ఆయనకి స్టోరీ లైన్ చెప్పి ఒప్పించాడదనే టాక్ నడుస్తుంది. కథ విషయంలో చిరు పూరికి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి కథని డెవెలెప్ చెయ్యమన్నారంటున్నారు.
పూర్తి కథతో మెప్పించి చిరు తో ఖచ్చితంగా సినిమా చెయ్యాలనే కసితో పూరి పనిచేస్తున్నాడట. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది అని చెప్పే పూరి.. లైగర్ ప్లాప్ తో ఓ రెండు నెలలు విరామం తీసుకుని.. మళ్ళీ తన స్కిల్‌నే నమ్ముకున్న పూరీ బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.