బిగ్ బాస్ 6 మరొక్క వారంలో గ్రాండ్ ఫినాలేకి దగ్గరవుతుంది. ఈ వారం హౌస్ నుండి ఏ ఇద్దరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో ప్రేక్షకులల్లో ఆసక్తి నడుస్తున్నా.. చివరి రెండుమూడు వారాల ఆట చూసి బుల్లితెర ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. సప్పగా, ఇంట్రెస్ట్ లేని టాస్క్ లతో ఈ చివరి రెండు వారాలు బిగ్ బాస్ ని చూడాలన్న ఆసక్తి కనబర్చడం లేదు. ప్రస్తుతం ఉన్న ఏడుగురిలో శ్రీసత్య-కీర్తి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది. టాప్ లోకి 4 గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి వెళ్లే ఛాన్స్ ఉంది అంటున్నాయి సర్వేలు.
శ్రీ సత్య ఎంతబాగా ఆడుతున్నా శ్రీహన్ ఫ్రెండ్ షిప్ ఆమెకి డ్యామేజ్ అయ్యింది. కీర్తి ఎంత పెరఫార్మెన్స్ ఇచ్చినా ఆమె చెయ్యి దెబ్బ ఆమెకి సహకరించడం లేదు. ఇక ఇనాయ మాత్రం ఖచ్చితంగా టాప్ లో ఉంటున్నట్లుగా బయట సర్వేలు చెబుతున్నాయి. రేవంత్ అందరికన్నా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంటే.. తర్వాత రోహిత్, ఆ తర్వాత శ్రీహన్ క్రేజీగా కనబడుతున్నారు. ఇప్పటికే శ్రీహన్ కి టాప్ 5 బెర్త్ కన్ ఫర్మ్ అయ్యింది. కానీ అతను మూడో స్థానానికే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. నాలుగో ప్లేస్ లో ఇనాయ, ఐదో స్థానంలో ఆది రెడ్డి ఉండొచ్చని ఓ సర్వే చెబుతుంది.
మరొక సర్వే శ్రీ సత్య టాప్5 లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆమె కోసం ఆది రెడ్డిని బలిచేసే యోచనలో బిగ్ బాస్ ఉన్నాడంటున్నారు. ఇక టాప్5 లో రేవంత్, రోహిత్, శ్రీహన్, ఇనాయ కన్ ఫర్మ్ గా ఉంటారని.. ఐదో ప్లేస్ లో శ్రీ సత్య-అది రెడ్డి మధ్యన టఫ్ ఫైట్ జరగొచ్చనే టాక్ కూడా వినిపిస్తుంది.