Advertisementt

వావ్: సీతగా సాయిపల్లవి

Wed 07th Dec 2022 05:39 PM
sai pallavi,sita role,ranbir kapoor  వావ్: సీతగా సాయిపల్లవి
Wow: Seetha as Sai Pallavi వావ్: సీతగా సాయిపల్లవి
Advertisement
Ads by CJ

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హవా తెలుగులో తగ్గింది. ఆమె ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ హీరో సినిమాలో కమిట్ అవ్వలేదు. విరాట పర్వం, తర్వాత సాయి పల్లవి ఒక్క తెలుగు ప్రాజెక్ట్ కి సైన్ చెయ్యలేదు. ఇక తమిళంలో కమల్ హాసన్ మూవీలో నటిస్తుంది. మలయాళ బ్యూటీగా తెలుగు ప్రేక్షక హృదయాలను మెప్పించిన సాయి పల్లవి ఇప్పుడు నార్త్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది అనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

హిందీలో సాయి పల్లవి ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించబోతున్నట్లుగా తెలుస్తుంది. స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో సాయి పల్లవి సీత కేరెక్టర్ లో కనిపించబోతుంది అని అంటున్నారు. రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా టాప్ హీరో హ్రితిక్ రోషన్ నటించనున్న ఈ క్రేజీ మూవీలో సాయి పల్లవి సీత గా మెప్పించడానికి రెడీ అవుతుందట. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదకి వెళుతుంది అని తెలుస్తుంది.

ఏ కేరెక్టర్ లో అయినా జీవించి ఆడియన్స్ ని ఆకట్టుకునే సాయి పల్లవి సీత కేరెక్టర్ చేస్తుంది అనగానే ఆమె అభిమానులు.. వావ్ సీత గా సాయి పల్లవి అంటూ ఆమెని ఆ కేరెక్టర్ లో ఊహించుకుంటూ హడావిడి చేస్తున్నారు.

Wow: Seetha as Sai Pallavi:

Sai Pallavi to Play Sita Role in Ranbir Kapoor Movie?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ