Advertisementt

వాల్తేరు వీరయ్య కూడా ఫిక్సయిపోయాడు

Wed 07th Dec 2022 04:31 PM
chiranjeevi,waltair veerayya  వాల్తేరు వీరయ్య కూడా ఫిక్సయిపోయాడు
Waltair Veerayya Releasing On January 13 వాల్తేరు వీరయ్య కూడా ఫిక్సయిపోయాడు
Advertisement
Ads by CJ

సంక్రాంతి రేస్ అంతకంతకు టైట్ అవుతుంది. నిన్నమొన్నటివరకు సంక్రాంతి రిలీజ్ అంటూ హంగామా చేసి అందరిని సస్పెన్స్ లో పడేసిన మేకర్స్.. ఇప్పుడు ఒక్కొక్కటిగా డేట్స్ లాక్ చేసి ఫాన్స్ కి ట్రీట్ ఇస్తున్నారు. ముందుగా బాలయ్య వీరసింహ రెడ్డి జనవరి 12 న రాబోతుంది.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య జనవరి 13 న డేట్ లాక్ చేసి మెగాస్టార్ మాస్ పోస్టర్ తో అధికారికంగా ప్రకటించారు. మైత్రి మూవీస్ వారే వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాలకి నిర్మాతలు కావడంతో ఈ ఫైట్ మరింత రంజుగా మారింది.

మెగాస్టార్ చిరు-బాబీ కాంబోలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ కూడా నటించడం మరింత ఇంట్రెస్టింగ్ విషయం. మాస్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించేలా మెగాస్టార్ లుక్, బాస్ పార్టీ సాంగ్ అన్ని హైలెట్స్ గా నిలవబోతున్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించబోతున్న ఈ చిత్రంలో ఊర్వశి రౌతేల్ల స్పెషల్ సాంగ్ కూడా మాస్ ఆడియన్స్ కి మరో ట్రీట్.

సో బాలయ్య బాబు జనవరి 12 న వస్తుంటే.. చిరు జనవరి 13 కి వస్తున్నారు. ఈ సంక్రాంతికి రెండు సినిమాలు మాత్రమే కాదు విజయ్ వారిసు ఇంకా చిన్న సినిమాలు రెండో మూడో లైన్ లో ఉన్నాయి.

Waltair Veerayya Releasing On January 13:

Chiranjeevi, Waltair Veerayya Releasing Worldwide January 13, 2023

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ