Advertisementt

బిగ్ బాస్ 6: ఆదిరెడ్డి ని తొక్కేసే ప్లాన్

Wed 07th Dec 2022 10:31 AM
bigg boss 6,adi reddy  బిగ్ బాస్ 6: ఆదిరెడ్డి ని తొక్కేసే ప్లాన్
Bigg Boss 6: A plan to trample Adireddy బిగ్ బాస్ 6: ఆదిరెడ్డి ని తొక్కేసే ప్లాన్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ లో కామన్ మ్యాన్ ని తొక్కేసే ప్లాన్ జరుగుతుందా? అంటే అవుననే అంటున్నారు బయట ఉన్న ఆయన ఫాన్స్. బిగ్ బాస్ సీజన్ 6 లోకి కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి టాప్ 5 కి దగ్గరైన ఆది రెడ్డిని బిగ్ బాస్ కావాలనే బ్యాడ్ చేస్తున్నాడనే ఆరోపణలు మొదలయ్యాయి. ఆది రెడ్డి తప్పెలా ఉన్నా నాగార్జున శనివారం ఎపిసోడ్ లో రేవంత్ ని హైలెట్ చెస్తూ ఆది రెడ్డి కి క్లాస్ పీకడం అప్పట్లోనే ఆయన ఫాన్స్ కి నచ్ఛలేదు. తాజాగా ఓటింగ్ లో అది రెడ్డి డేంజర్ జోన్ లో ఉన్నాడంటూ ప్రచారం జరుగుతుంది.

ఈ వారం టికెట్ టు ఫినాలే కొట్టి శ్రీహన్ డైరెక్ట్ గా టాప్ 5 లోకి అడుగుపెట్టగా.. మిగతా వారు ఎవరు ఎలిమినేట్ అవుతారో.. ఎవరు టాప్ 5 కి వెళతారో అనేది ఆసక్తికరంగా మారింది. శ్రీ సత్య వీక్ ఆమె ఖచ్చితంగా ఈ వారం బయటికి వెళుతుంది అనుకుంటే.. ఆమె గత రెండు రోజులుగా టాస్క్ ల్లో దుమ్మురేపుతోంది. హౌస్ మేట్స్ కూడా శ్రీ సత్య శక్తిని అంచనా వేయలేకపోయారు. ఆమె సోలోగానూ గెలిచి, శ్రీహన్ తో జోడిగాను గెలిచింది. ఇక రేవంత్ అయితే టాస్క్ ల్లో ఎలా ఆడతాడో చెప్పక్కర్లేదు.

ఈ వారం కీర్తిని, ఆది రెడ్డిని ఓటింగ్ పరంగా డేంజర్ జోన్ లోకి గెంటెయ్యడం చూసిన నెటిజెన్స్, ఆది రెడ్డి ఫాన్స్ కూడా ఆది రెడ్డిని కావాలనే తోక్కేస్తున్నారు, ఇలా ఎలిమినేషన్స్ లోకి తీసుకువస్తున్నారు, లేదంటే ఆది రెడ్డి టాప్ 5 కాదు టాప్3 లో ఉంటాడంటూ బిగ్ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యని టాప్5 లో ఉంచేందుకే ఆది రెడ్డిని ఇలా డేంజర్ జోన్ లో చూపిస్తున్నారనే కామెంట్స్ కూడా పడుతున్నాయి.

Bigg Boss 6: A plan to trample Adireddy:

Bigg Boss 6: This week highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ