బాలకృష్ణ ఒక టాక్ షో చెయ్యడం నిజంగా వింతే. ఆయన సినిమాల్లో ఎంత పర్ఫెక్ట్ గా డైలాగ్ చెప్పగలరో.. బయట ఆయన మాటల్లో అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి బాలయ్య తో అరవింద్ టాక్ షో ప్లాన్ చేసి అదిరిపోయే సక్సెస్ అయ్యారు. అన్ స్టాపబుల్ సీజన్ వన్ బంపర్ హిట్ అవడంతో సీజన్ 2 పై అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ పెరిగింది. కానీ అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. సీజన్ వన్ మహేష్ లాంటి గెస్ట్ ఒక్కరే స్టేజ్ పై ఉన్నా అది అందరికి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సీజన్ 2 లో నలుగురు ఉన్నా అది అంతగా ఇంట్రెస్టింగ్ గా లేదు.
సీజన్ వన్ లోనే చాలామంది హీరోలు వచ్చెయ్యడం, సీజన్ 2 లో రావాల్సిన చిరు, పవన్ ఎపిసోడ్స్ డైలమాలో ఉండడం, అలాగే షోలో గెస్ట్ లు కరువవ్వడం అన్ని అన్ స్టాపబుల్ షో పై ఆసక్తిని తగ్గించడానికి కారణమయ్యాయి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ వచ్చినా మళ్ళీ షో ఊపందుకోవడం ఖాయం. కానీ ప్రభాస్ ఈ షోకి వస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ వస్తే ఆయన పెళ్లి విషయాలు ఎంతో కొంత రివీల్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి.. ఆ ఎపిసోడ్ కి విపరీతమైన ఆసక్తి క్రియేట్ అవుతుంది.
కానీ ప్రభాస్ ని తెస్తారా.. అరవింద్ గారు ఏం చేస్తారో కానీ.. బాలయ్య మాటల్లో పస తగ్గింది, పట్టి పట్టి మాట్లాడుతున్నారు. మాటల్లో తడబాటు, స్క్రిప్ట్ ప్రకారమే షో నడిచినా.. అందులో రియాలిటీ, నేచురల్ గా ఉండేలా చూడాలి. మొదట్లో బాలయ్య తడబడినా తిప్పుకున్నారు. కానీ సెకండ్ సీజన్ లో బాలయ్య తడబాటు, ఆహా వాళ్ళ ప్లానింగ్ అన్ని ఈ షోకి మైనస్ లుగా కనబడుతున్నాయి. పెంచండయ్యా.. కాస్త ఆసక్తి పెంచండి అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.