బాలీవుడ్ భామ మలైకా అరోరా భర్త అర్బాజ్ ఖాన్ కి విడాకులిచ్చి కుర్ర హీరో అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తుంది. ఆమె ఈ మధ్యన ప్రెగ్నెంట్ అంటూ వార్తలు రావడం వాటిని అర్జున్ కపూర్ కొట్టెయ్యడం కాదు, ఫైర్ అవ్వడం చూసాం. తాజాగా మలైకా అరోరా తన భర్తకు ఎందుకు విడాకులిచ్చిందో.. అర్జున్ కపూర్ తో తనెంత సంతోషంగా ఉందొ ఓ షో లో వివరించింది. మలైకా కపూర్ ప్రముఖ ఓటిటి సంస్థ కోసం మూవింగ్ ఇన్ విత్ మలైకా షో చేస్తుంది. ఈ షో మొదటి ఎపిసోడ్ కి కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ హాజరైంది.
ఈ షో లోనే మలైకాని ఫరా ఖాన్ అర్జున్ కపూర్ ని పెళ్లి చేసుకుని, పిల్లలని కనాలనే ప్లాన్స్ ఉన్నాయా అని అడిగింది. దానికి మలైకా కూడా సూటిగానే జవాబిచ్చింది. ప్రస్తుతం అర్జున్‌తో తాను చాలా సంతోషంగా ఉన్నానని, అర్జున్ తో ఫ్యూచర్ ఏమిటో తనకి తెలియదని, మా ఇద్దరి విషయంలో ఎవ్వరేమనుకుంటున్నారో తాను పట్టించుకోనని స్పష్టం చేసింది. అంతేకాకుండా తన భర్త అర్బాజ్ ఖాన్ కి విడాకులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో కూడా రివీల్ చేసింది.
తనకి చాలా చిన్న వయసులోనే పెళ్లి జరిగింది అని, అలా సమయం గడిచేకొద్దీ మారుతూ వచ్చాను, లైఫ్ లో డిఫరెంట్ విషయాలను కోరుకున్నాను, అసలు దబాంగ్ విడుదలయ్యేవరకు మా మధ్యన గొడవలేం లేవు, తర్వాత అంతా మారిపోయింది. పరిస్థితులు సహకరించకపోవడంతోనే విడిపోయామంటూ మలైకా విడాకుల విషయాన్ని బయటపెట్టింది.