పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ లో ఉన్నారంటే పవన్ ఫాన్స్ కి పూనకాలే. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాల తర్వాత హరి హర వీరమల్లు కోసం ఫాన్స్ వెయిటింగ్. కానీ ఆ సినిమా షూటింగ్ అంతకంతకు లేట్ అవుతూనే ఉంది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గత నెల నుండి వీరమల్లు కొత్త షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. రామోజీ ఫిలిం సిటీలో వీరమల్లు వీర విన్యాసాల చిత్రీకరణలో దర్శకుడు క్రిష్ తలమునకలై ఉన్నారు.
రామోజీ ఫిలిం సిటీలో పవన్ కళ్యాణ్ వీరమల్లు గెటప్ లో బైక్ రైడ్ కూడా చేస్తున్నారు. ఈ రోజు మంగళవారం హరి హర వీరమల్లు సెట్స్ నుండి పవన్ కళ్యాణ్ వీరమల్లు లుక్ ఒకటి బయటికి వచ్చింది. గతంలో ఫస్ట్ లుక్ వదిలినా.. నేడు పవన్ కళ్యాణ్ రెడ్ డ్రెస్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. పవన్ ఫాన్స్ తగులుకుని పవన్ కొత్త లుక్ ని ట్రెండ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ రాజకీలంటూ బయటికి వెళుతున్నా ఒకటే హెయిర్ స్టైల్ మెయింటింగ్ చెయ్యడంతో.. వీరమల్లు పాత్ర లుక్ లో పెద్దగా డిఫరెన్స్ చూపించాల్సిన అవసరం రాలేదు. అందుకే రాజకీయాలు, సినిమా షూటింగ్స్ రెండిటికి హాజరవుతున్నారు.
ప్రస్తుతం హరి హర వీరమల్లు షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఈ చిత్రంలో అర్జున్ రామ్ పాల్ పవన్ కి విలన్ గా నటిస్తుండగా.. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.